నులిపురుగుల సమస్యకు ఈ ఇంటి చిట్కాలతో చెప్పండి బై బై..!
TeluguStop.com
దాదాపు ప్రతి వ్యక్తి అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో నులిపురుగులు( Worms ) ఒకటి.
చిన్నపిల్లల్లో నులిపురుగుల సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.అలాగే పెద్దల్లో కూడా కొందరు తరచూ నులిపురుగులతో బాధపడుతుంటారు.
వ్యక్తిగత శుభ్రత లేకపోవడం, ఉడకని కలుషిత ఆహారం తీసుకోవడం, తీయని పదార్థాలు ఎక్కువగా తీసుకుని వ్యాయామం చెయ్యకపోవడం, రెండు విరుద్ధమైన పదార్థాలను కలిపి తినడం తదితర కారణాల వల్ల కడుపులో( Stomach ) నులిపురుగులు ఏర్పడతాయి.
ఇవి మన ఆహారంలోని పోషకాలు శరీరానికి అందకుండా అంతరాయం కలిగిస్తాయి.పైగా నులిపురుగుల కారణంగా వికారం, వాంతులు, అతిసారం, డీహైడ్రేషన్, బరువు తగ్గడం, విపరీతమైన కడుపు నొప్పి, అలసట, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలన్నీ తలెత్తుతాయి.
కాబట్టి పేగుల్లోని నులిపురుగులను నిర్మూలించడం చాలా అవసరం.అయితే నులిపురుగుల సమస్యకు ఇంట్లోనే ఎన్నో ఔషధాలు ఉన్నాయి.
"""/" /
బొప్పాయి గింజల్లో( Papaya Seeds ) పాపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది.
ఇది యాంటీ పారాసైటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది.బొప్పాయి పండులో ఉండే నల్లటి గింజలు నులిపురుగులను ఎదుర్కోవడంలో శక్తివంతంగా ఉంటాయి.
నులిపురుగుల నివారణకు బొప్పాయి గింజలను ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి.ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గింజల పొడిని గోరువెచ్చని వాటర్ లో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
"""/" /
శొంఠి, తేనె.( Dry Ginger, Honey ) ఈ రెండింటి కాంబినేషన్ నులిపురుగులను నిర్మూలించడానికి చక్కని ఔషధంగా పనిచేస్తుంది.
హాఫ్ టీ స్పూన్ శొంఠి పొడిలో వన్ టీ స్పూన్ తేనె కలిపి రోజు ఉదయం తీసుకోవాలి.
ఈ విధంగా చేస్తే నులిపురుగులు నాశనమవుతాయి.అలాగే అర టీ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు, కొద్దిగా నల్ల ఉప్పు కలిపి మెత్తగా దంచుకోవాలి.
రెండు స్పూన్ల నిమ్మరసంతో పాటు ఈ మిశ్రమాన్ని ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి నిత్యం తీసుకోవాలి.
వారం రోజుల పాటు ఈ విధంగా చేస్తే నులిపురుగుల సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.
నులిపురుగులను నిర్మూలించడానికి ముల్లంగి రసం కూడా చాలా బాగా సహాయపడుతుంది.ముల్లంగి నుంచి రసం తీసుకుని చిటికెడు నల్ల ఉప్పు కలిపి తీసుకోవాలి.
రోజుకో రెండుసార్లు ముల్లంగి రసం తాగితే నులిపురుగులు నాశనం అవుతాయి.
రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…