సిజేరియన్ త‌ర్వాత ఖ‌చ్చితంగా ఈ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ట‌.. తెలుసా?

నేటి కాలంలో ఎక్కువ శాతం మంది సిజేరియ‌న్‌కే మొగ్గు చూపుతున్నారు.నార్మ‌ల్ డెలివ‌రీపై భ‌యం పెర‌గ‌డం లేదా డ‌బ్బులు గుంజేందుకు వైద్యులు ఏదో ఒక సాకు చెప్ప‌డం వ‌ల్ల.

ఈ రోజుల్లో సహజ కాన్పుల ఊసే లేకుండా పోయింది.మ‌రికొంద‌రు తల్లి, బిడ్డ ఆరోగ్యంపై రిస్క్ పడటం ఇష్టం లేక సిజేరియ‌న్ చేయించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు.

ఇక కార‌ణం ఏదైన‌ప్ప‌టికీ సిజేరియ‌న్ త‌ర్వాత దాదాపు మూడు నెల‌లు పాటు చాలా జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంది.

సిజేరియ‌న్ త‌ర్వాత ఒకే చోటు కూర్చోవ‌డం, ప‌డుకోవ‌డం చేయ‌కూడ‌దు.దీని వ‌ల్ల అమాంతం బ‌రువు పెరిగిపోతారు.

ఫ‌లితం ఎన్నో స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అందుకే సిజేరియ‌న్ అయితే రెండు లేదా మూడు వారాల త‌ర్వాత రెండు గంట‌ల‌కు ఒక‌సారి అయినా చాలా మెల్ల‌గా నడ‌వ‌డం మొద‌లు పెట్టాలి.

అలాగే సిజేరియ‌న్ త‌ర్వాత అతిగా నీటిలో తడవ‌డం, చ‌ల్ల‌ని నీరు తాగ‌డం, చ‌ల్ల‌గా ఉండే ప్ర‌దేశాల్లో ఉండ‌టం వంటివి చేయ‌కూడ‌దు.

మ‌రియు చెవుల్లోకి గాలి వెళ్ల‌కుండా కాట‌న్ పెట్టుకోవాలి. """/" / వైద్యులు సూచించిన మెడిసిన్స్ ని క్ర‌మం త‌ప్ప‌కుండా వాడితే.

సిజేరియన్ గాయం త్వ‌ర‌గా న‌యం అవుతుంది.అలాగే సిజేరియన్ గాయాన్ని ప్రతివారం తప్పక డ్రెసింగ్ చేయించుకోవాలి.

మ‌రియు సిజేరియన్ గాయానికి త‌డి త‌గ‌ల‌కుండా చూసుకోవాలి.స్నానం చేసిన త‌ర్వాత కూడా త‌డిని బాగా ఆర‌పెట్టుకోవాలి.

లేకుంటే ఇన్ఫెక్ష‌న్ అవుతుంది.ఇక బిడ్డ ప‌డుకునే స‌మ‌యంలో ఖ‌చ్చితంగా మీరు ప‌డుకోవాలి.

లేదంటే నిద్ర చాల‌క నీర‌స ప‌డిపోతారు.అలాగే ఆహారం విష‌యంలో కూడా ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.

ముఖ్యంగా సిజేరియ‌న్ త‌ర్వాత త్వ‌ర‌గా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకోవాలి.ఓట్స్, రాగులు, గోధుమ‌లు, అటుకులు, సజ్జలు, మొలకెత్తిన విత్తనాలు, పచ్చి బఠాణీలు, ఆకుకూర‌లు, పాలు వంటివి తీసుకోవాలి.

మ‌రియు విటమిన్ సి అధికంగా వుండే ఆహారం తీసుకోవాలి.త్వ‌ర‌గా కోలుకునేందుకు విట‌మిన్ సి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

2024 బెస్ట్ సినిమా ఇదే.. వైరల్ అవుతున్న జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు!