ఏం తిన్నా క‌డుపు ఉబ్బ‌రంగా ఉంటుందా? అయితే ఇవి తెలుసుకోండి!

సాధారణంగా కొందరికి ఏం తిన్నా కడుపు ఉబ్బరంగా మారిపోతుంటుంది.ఈ కడుపు ఉబ్బరం వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతుంటారు.

అలాగే చేసే పనిపై దృష్టి సారించలేకపోతున్నారు.వాస్తవానికి కడుపు ఉబ్బరం అనేది సర్వసాధారణంగా వేధించే జీర్ణ సమస్య.

ఇది ఎప్పుడో ఒకసారి ఇబ్బంది పెడితే.పెద్ద సమస్యగా అనిపించదు.

కానీ ప్రతిరోజూ మదన పెడుతుంటే.ఇక వారి బాధ వర్ణనాతీతం.

ఈ క్రమంలోనే ఇష్టమైన ఆహారం కళ్ళ ముందు ఉన్న తినలేక ఆందోళన చెందుతూ ఉంటారు.

మీరు ఈ జాబితా లో ఉన్నారా.? అయితే ఇకపై వర్రీ వద్దు.

ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే చిన్న చిన్న జాగ్రత్తల‌ను తీసుకుంటే కనుక కడుపు ఉబ్బరానికి దూరంగా ఉండొచ్చు.

ఇష్టమైన ఆహారాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం పదండి.

చాలామంది ఆహారాన్ని త్వరత్వరగా తినేస్తుంటారు.న‌వ‌ల‌డానికి అస్సలు సమయాన్ని కేటాయించరు.

ఇలాంటి వారిని కడుపు ఉబ్బరం అత్యధికంగా వేధిస్తుంది.అందుకే ఏ ఆహారాన్ని తీసుకున్న బాగా నమిలి తినాలి.

అప్పుడే అది త్వరగా జీర్ణమవుతుంది.తద్వారా కడుపు ఉబ్బరం సమస్య దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.

"""/" / అలాగే కంటి నిండా నిద్ర లేకున్నా జీర్ణ వ్యవస్థ ప్రభావితం అవుతుంది.

కడుపు ఉబ్బ‌ర‌మే కాదు గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి తదితర సమస్యలు ఇబ్బంది పెడతాయి.

అందుకే రోజుకు ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్రించాలి.తరచూ కడుపు ఉబ్బరం సమస్య తో బాధపడే వారు డైట్ లో అల్లం టీ, పుదీనా టీ, సోంపు టీ వంటి వాటిని చేర్చుకోవాలి.

ఇవి జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి కడుపు ఉబ్బరానికి అడ్డుకట్ట వేస్తాయి.ఇక కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడేవారు ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోవాలి.

శరీరానికి సరిపడా నీటిని అందించాలి.మరియు రోజుకు అరగంట పాటు వ్యాయామం చేయాలి.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే కడుపు ఉబ్బరం అన్న మాట అనరు.

బిగ్ బాస్ వల్ల ఆయనకే లాభం.. పల్లవి ప్రశాంత్ కళ్ళు నెత్తికెక్కాయి: షకీలా