పెద్దప్రేగు ఇన్ఫెక్షన్‌కు దూరంగా ఉండాలంటే ఈ జాగ్ర‌త్తలు త‌ప్ప‌నిస‌రి!

పెద్దప్రేగు ఇన్ఫెక్షన్‌.కోల‌న్ ఇన్ఫెక్ష‌న్ అని కూడా అంటారు.

ఇటీవ‌ల రోజుల్లో చాలా మంది పెద్ద‌ప్రేగు ఇన్ఫెక్ష‌న్ బారిన ప‌డుతున్నారు.జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఒక భాగ‌మైన పెద్ద‌ప్రేగులో కొన్నిసార్లు వ్య‌ర్థాలు పేరుకుపోతుంటాయి.

ఈ వ్య‌ర్థాలు క్ర‌మంగా ఇన్ఫెక్ష‌న్‌కు కార‌ణం అవుతాయి.దీంతో క‌డుపు నొప్పి, విరేచ‌నాలు, తీవ్ర‌మైన అల‌స‌ట‌, నీర‌సం, ఉన్న‌ట్టుండి బ‌రువు త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌లు మ‌ద‌న పెడ‌తాయి.

పెద్ద‌ప్రేగు ఇన్ఫెక్ష‌న్‌కు గురైంద‌ని సూచించే ల‌క్ష‌ణాలు ఇవి.వీటిని అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు.

పొరపాటున చేశారా.పెద్ద‌ప్రేగు క్యాన్స‌ర్‌కు దారి తీస్తుంది.

దాంతో శారీర‌కంగానే కాకుండా ఆర్థికంగానూ అనేక ఇబ్బందుల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.అందుకే వ‌చ్చాక బాధ‌ప‌డ‌టం కంటే పెద్ద‌ప్రేగు ఇన్ఫెక్ష‌న్‌ రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డ‌మే మంచిద‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌రి ఇంత‌కీ పెద్దప్రేగు ఇన్ఫెక్షన్‌కు దూరంగా ఉండాలంటే ఏయే జాగ్ర‌త్తలు తీసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

పెద్ద‌ప్రేగు ఇన్ఫెక్ష‌న్ ద‌రి చేర‌కూడ‌దంటే శ‌రీరానికి స‌రిప‌డా నీటిని అందించాలి.ముఖ్యంగా ఉద‌యం లేవ‌గానే ఖాళీ క‌డుపుతో రెండు గ్లాసుల గోరు వెచ్చ‌ని నీటిని తాగాలి.

అదే స‌మ‌యంలో తాగునీరు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.నీటిలో ఏవైనా మ‌లినాలు ఉంటే వాటిని కాచి చ‌ల్లార్చుకుని తాగాలి.

అలాగే వీలైనంత వ‌ర‌కు జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. """/" / జంక్ ఫుడ్ పెద్ద‌ప్రేగు ఇన్ఫెక్ష‌న్ రావ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది.

కాబ‌ట్టి, దాని జోలికి వెళ్ల‌క‌పోవ‌డం ఎంతో మంచిది.డైట్‌లో యాపిల్‌, బొప్పాయి, మామిడి వంటి పండ్ల‌ను తీసుకోవాలి.

త‌ద్వారా వాటిలో ఉండే పోష‌కాలు వ్య‌ర్థాల‌ను పూర్తిగా తొల‌గించి పెద్ద‌ప్రేగు ఇన్ఫెక్ష‌న్ ఏర్ప‌డ‌కుండా అడ్డుక‌ట్ట వేస్తాయి.

అవిసె గింజలు, గుమ్మ‌డి గింజ‌లు త‌ర‌చూ తీసుకోవాలి.వీటిలో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణ ప్రక్రియ సాఫీగా జ‌రిగేందుకు స‌హాయ‌ప‌డ‌తుంది.

ల‌వంగాలు కూడా తీసుకుంటూ ఉంటే.అందులో ఉండే శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ పెద్దప్రేగులో విషాన్ని తొలగించి ఇన్ఫెష‌న్ రాకుండా ర‌క్ష‌ణ కల్పిస్తాయి.

ఇక పెద్దప్రేగు ఇన్ఫెక్షన్‌కు దూరంగా ఉండాల‌నుకుంటే మ‌ద్య‌పానం అల‌వాటును మానుకోవాలి.మ‌రియు ప్ర‌తి రోజు వ్యాయామాలు చేయాలి.

Ravi Teja : ఒకప్పుడు రవితేజ ను అవమానించిన స్టార్ డైరెక్టర్ ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలని చూస్తున్నాడా..?