వీరి సినిమాలు ఎంతో బాగుంటాయి కానీ వాటి కోసం కళ్ళు కాసేలా ఎదురు చూడాల్సిందే !

ప్రస్తుతం టాలీవుడ్( Tollywood ) లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక సినిమా తీయాలి అంటే అందుకు పురిటినొప్పులు పడ్డంత బాధగా ఉంటుంది అంటే ఒక సినిమా బయటకు రావాలంటే అంత పెద్ద సమస్యల నుంచి బయటపడాలి సినిమా మొదలైన నుంచి చివరి వరకు ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి వాటికన్నా ముందు బడ్జెట్ క్యాస్టింగ్ ప్రొడక్షన్ బడ్జెట్ అంటూ అనేక విషయాలను దృష్టిలో పెట్టుకొని సినిమా ఇస్తారు అందువల్ల సినిమా పూర్తి అయ్యేసరికి చాలా టైం కూడా పడుతుంది.

ఒకప్పుడు చాలా త్వర త్వరగా సినిమాలు తీసేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

పైగా కొంతమంది ఎంతో అద్భుతమైన సినిమాలో తీయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు ఇంతకీ అలా మంచి టేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటున్న వారు ఎవరు ఈ ఆర్టికల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

"""/" / ఈ లిస్టులో ముందు అందరూ రాజమౌళి( Rajamouli ) గురించే చెబుతారు ఆయన సినిమాని చెక్కి చెక్కి జక్కన్నల మారిపోయారు అందుకే ఆయన సినిమా రావాలంటే నాలుగేళ్లు కచ్చితంగా పడుతుంది.

అలాగే ఉయ్యాల జంపాల, మజ్ను అంటే అద్భుతమైన సినిమాలను తీసిన విరించి వర్మ కూడా చాలా గ్యాప్ తీసుకుంటున్నారు ఇప్పుడైతే ఏకంగా ఏడేళ్ళకు పైగానే అయింది ఆయన సినిమా వచ్చి.

ఇక హీరోల విషయానికొస్తే అడవి శేషు ( Adavi Seshu )తన కథను తానే రాసుకుంటారు అందుకే ప్రతి సినిమాకి గ్యాప్ తీసుకుంటున్నారు.

నవీన్ పోలిశెట్టి ( Naveen Polishetty )కూడా ఇదే తరహా సినిమాలో తీస్తున్నాడు.

చాలా ఆలోచించి అన్ని రకాల ఆచితూచి సినిమా తీస్తాడు అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హీట్ అవుతుంది.

"""/" / ఇక శేఖర్ కమ్ముల( Shekhar Kammula ) విషయానికొచ్చే సరికి ఆయన సినిమాలు కూడా ఎంతో అద్భుతంగా కళ్ళకు పండగల ఉంటాయి.

కానీ ఒక సినిమా పూర్తి చేయడానికి ఏకంగా నాలుగేళ్ల సమయం తీసుకుంటున్నాడు శేఖర్ కమల ఈరకంగా టాలీవుడ్ లో చాలా మంది ఈ ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుని సినిమాలు చాలా జాగ్రత్తగా చెక్కుతూ రిలీజ్ చేస్తున్నారు.

విజయం, పరాజయం అనేది మన చేతిలో ఉండదు కానీ షూటింగ్ జరుగుతున్నప్పుడే దానికి సంబంధించిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలన్న కారణంతోనే ఇలా ఎక్కువ టైం తీసుకుంటున్నారు ఒక సినిమా కోసం.

శోభిత చైతు జాతకాలపై మరో జ్యోతిష్యుడు కామెంట్స్..  వేణు స్వామిని మించి ఉన్నాడే?