ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే పూజలో ఈ వస్తువులు తప్పనిసరి!

మన హిందువులు దేవుడిపై ఎంతో నమ్మకం ఉంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దేవుడిని ప్రార్థిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ప్రతి ఇంటిలో పూజా మందిరాన్ని నిర్మించుకొని తమ ఇష్టదైవానికి పూజలు నిర్వహిస్తారు.

ఈ విధంగా ప్రతి రోజు పూజ చేసే సమయంలో ఎన్నో నియమ నిష్టలను పాటిస్తారు.

అదే విధంగా మన ఇంట్లో సిరిసంపదలు కలగాలని, ఎక్కువగా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు.

అయితే ఈ విధంగా పూజ చేసేటప్పుడు కొన్ని వస్తువులు మన పూజగదిలో ఉంటే అమ్మవారి అనుగ్రహం కలిగి ధన లాభం కలుగుతుందని భావిస్తారు.

అయితే పూజ గదిలో ఉండాల్సిన ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.M/br శంఖం: పూజ గదిలో శంఖం ఉండటం ఎంతో మంచిదని భావిస్తారు.

పురాణాల ప్రకారం సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవితో పాటు శంఖం పుట్టిందని, లక్ష్మీదేవికి శంఖం సోదరిగా భావించి పూజలు చేయటం వల్ల వారికి ధన లక్ష్మి కటాక్షం కలుగుతుందనీ పండితులు చెబుతున్నారు.

అందుకే పూజానంతరం శంఖారావం చేయటం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కొలువై ఉంటాయి.

"""/"/ సాలిగ్రామం: సాలిగ్రామం అనేది విష్ణువు ప్రతిరూపంగా భావిస్తారు.ఈ సాలిగ్రామం పూజ గదిలో ఉంచుకొని తులసి మాలలతో పూజ చేయాలి.

తులసి మాలతో పూజ గంట: దేవాలయాలలో గంటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.పూజ చేసే సమయంలో భక్తుల దృష్టిని గంట దేవుడిపై మళ్లిస్తుంది.

మన మెదడులో ఉన్న ఆలోచనలు తొలగించి దేవుడిపై దృష్టి సాధించడానికి ఆలయంలో గంటను ఉంచుతారు.

అదే విధంగా మన ఇంట్లో పూజ సమయంలో మంత్రాలు చదివిన తర్వాత గంట మృోగించడం వల్ల మన ఇంట్లో ఏర్పడిన దుష్ట శక్తులు తొలగిపోతాయి.

"""/"/ నెమలి ఈక: చాలామంది నెమలీకలు ఇంట్లో ఉంచుకోవాలా లేదా అనే సందేహం వ్యక్తం చేస్తుంటారు.

నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఎంతో శుభ పరిణామంగా భావిస్తారు.వాస్తు శాస్త్రం ప్రకారం నెమలి ఈకలు ఇంట్లో ఉంటే సంపద పెరుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ విధంగా మనం పూజ చేసే సమయంలో పూజ గదిలో ఈ వస్తువులు ఉండటం వల్ల సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.

క్యాన్సర్‌తో బాధపడుతున్న వ్యక్తికి తగిలిన జాక్‌పాట్.. ఎంతంటే..??