చాణక్య నీతి: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపాలు..

చాణక్య నీతి: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపాలు

ఆచార్య చాణక్యుడు తన చాణక్యనీతిలో మనిషి తన జీవితాన్ని ఆనందంగా గడిపే మార్గాన్ని చూపడంతో పాటు అనేక ముఖ్యమైన సందేశాలను అందించారు.

చాణక్య నీతి: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపాలు

జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించిన సమాచారం చాణక్యుడి నీతి శాస్త్రంలో ఉంది.ఆచార్య చాణక్యుడు అర్థశాస్త్రం, రాజకీయాలతో పాటు, పాపం, పుణ్యం, కర్తవ్యం, ధర్మం, అధర్మం గురించి తన నీతిశాస్త్రంలో రాశారు.

చాణక్య నీతి: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు పిల్లలకు శాపాలు

ఆచార్య చాణక్య అందించిన విధానాలు మన జీవితంలో ఆనందం, శాంతి, విజయాలను అందిస్తాయి.

ఆచార్య చాణక్య తెలిపిన జీవిన విధానాలలో కొన్నింటిని ఇప్పుడు తెలుసుకుందాం.వీటిని తల్లిదండ్రుందరూ గుర్తుంచుకోవాలి.

పిల్లలలో విలువలను పెంపొందించాలి.ఆచార్య చాణక్యుడి నీతి శాస్త్రం ప్రకారం వివేకవంతులైన తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నతనం నుంచే సద్గుణాలతో కూడిన విద్యను అందించాలి.

ఎందుకంటే మంచి గుణాలు కలిగిన వ్యక్తికి సమాజంలో గౌరవాన్ని అందుకుంటాడు.చిన్నతనంలో పిల్లల మనసులలో మంచి అనే బీజాలు నాటితే వారు సత్ప్రవర్తనతో మెలుగుతారు.

అందుకే తల్లిదండ్రులు తమ పిల్లలకు మార్గనిర్దేశం చేయాలి.ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలోని రెండవ అధ్యాయంలోని 11వ శ్లోకంలో.

పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ చూపని తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటివారని చెప్పారు.

చదువురాని వారిని పండితుల మధ్య కూర్చోబెడితే వారు పండితులను తృణీకరిస్తారు.అయితే పండితుల మధ్య పెరిగే పిల్లలు విద్యలో రాణిస్తారు.

పిల్లలకు విద్య ఎంతో అవసరం.ఆచార్య చాణక్య తెలిపిన వివరాల ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తే వారు చెడిపోతారు.

అలాగే పిల్లలు చేసే తప్పును నిర్లక్ష్యం చేస్తే, వారు తప్పుడు దారి పడతారు.

పిల్లలు ఏదైనా తప్పుడు పని చేస్తే, వారు అటువంటి తప్పులు చేయకుండా చూడాలి.

చిన్నతనంలోనే పిల్లలకు మంచి చదువు, జ్ఞానం అందిస్తే వారు తల్లిదండ్రులకు సేవ చేసేలా ఎదుగుతాడు.

దీంతో పాటు వారు కుటుంబానికి మంచి పేరు తీసుకువస్తారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీని రీమేక్ చేయాలని ఉంది.. ఎన్టీఆర్ బావ షాకింగ్ కామెంట్స్ !