ఈ ముగ్గురు దిగ్గజాల మనవలు కూడా టాలీవుడ్ హీరోస్ అని మీకు తెలుసా..?
TeluguStop.com
సినిమా మీద ఇష్టంతో ఇండస్ట్రీలోకి దూసుకొచ్చి వారికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకొని సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న, ఎలినా ఎంతమంది నటీనటులను మనం చూసాం.
అయితే ప్రతి ఫీల్డ్ లో వారసత్వం అనేది ఒకటుంటుంది కదా.దాన్నే ఈ మద్య కాలంలో నేపోటిజం పేరుతో కొత్తవాళ్ళకి అవకాశాలు ఇవ్వడం లేదని, ఇప్పటివరకు సినిమాల్లో రాణించిన వారి వారి వారసులే ఇండస్ట్రీని ఏలుతున్నారని కొందరు వాపోతున్నారు మీడియా కూడా ఈ విషయాన్నీ సందర్భాన్ని బట్టి హైలెట్ చేస్తూనే ఉంది.
అయితే వారసత్వంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతమంది వారి సత్తా చాటలేక కనుమరుగు అవుతున్నారు.
అలా తండ్రి తథా పేరు చెప్పుకొని వచ్చి కనుమరుగు అయిపోయిన కొందరు నటీనటులు ఎవరో ఇప్పుడు ఒకసారి చూద్దాం.
ఈ లిస్ట్ లో ముందు వరసలో ఉన్నారు.అలనాటి విలక్షణ నటుడు నాగభూషణం గారి వారసుడు.
నాగభూషణం గారు ఎంత పెద్ద నటులో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.విలన్ పాత్రలకు పెట్టింది పేరు నాగభూషణం.
అసలు పాత్ర ఏదైనా దానిలో పరకాయ ప్రవేశం చేసి నటించగల నటధీరుడు.అందుకే ఈయనతో కలిసి నటించాలంటే అప్పటి హీరోహీరోయిన్లు కొంతమంది బయపడేవారట.
అలాంటి నటుడు కూతురు మీర్ అనే బాలీవుడ్ దర్శకుడిని పెళ్లిచేసుకుంది. """/"/ వారి కొడుకే సయ్యద్ అమీద్ భూషణ్! అయితే భూషణ్ తన మొదటి సినిమాతోనే మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాల్లో నటించాడు కానీ హీరోగా మాత్రం తగినంత గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.
అర్ధంచేసుకోరు, మ్యావ్, పదహారేళ్ళ వయసు, ఏక్ పోలీస్ మంత్రి అంటూ కొన్ని తెలుగు సినిమాల్లో నటించిన అంతగా గుర్తింపు రాకపోవడంతో.
ఇపుడు బాలీవుడ్ కి వెళ్లి వాళ్ళ తథా నాగభూషణం లాగానే అక్కడ మంచి మంచి విలన్ పాత్రల్లో నటిస్తున్నాడు.
"""/"/
ఇక ఒకప్పటి హీరో కత్తి కాంతారావు గారి గురించి కూడా మనందరికి తెలిసిందే.
ఆయన హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే కాంతారావుగారికి ఎలాగైనా వాళ్ళ వారసులను కూడా సినిమాల్లోకి తీసుకురావాలని ఒక కోరిక ఉందట.
ఆ నేపథ్యంలోనే తన మనవడిని చిన్నప్పుడే బాలనటుడిగా స్వాతిముత్యం సినిమా ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయం చేసాడు.
స్వాతిముత్యం సినిమాలో రాధికా అండ్ కమలహాస్సన్ కి ధీటుగా ఈ బుడ్డోడు కార్తీక్ కూడా బలే నటించాడు.
అయితే ఆ తర్వాత బాలనటుడిగా గాని పెద్దయ్యాక హీరోగా గని నటించలేదు. """/"/
ఇక ఒకప్పటి నటవిశ్వరూపం ఎస్వీ రంగారావు గారు ఎంతో గొప్ప నటుల్లో మనందరికి తెలిసిందే.
ఆయన డైలాగ్ డెలివరీ, ఆ హావభావాలు పలికించడం అబ్బా.బలేఉంటుంది ఆయన నటన! రామారావు, నాగేశ్వరావు లాంటి హీరోలకు ధీటుగా నటిస్తూ తెలుగు సినిమాని ఒక స్థాయిలో నిలబెట్టిన నటులలో రంగారావు గారు కూడా ఒకరు అయితే రంగారావు గారు సినిమాల్లో ఉన్నప్పుడే తన కొడుకును సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నించారు.
కానీ అది కుదరక ముందే ఆయన కన్నుమూశారు.ఇక ఇప్పుడు ఆయన మనవడు ఎల్7 అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
ఇప్పుడు తెలుగులోనే అరకొర సినిమాలు సొంత బ్యానర్ లోనే తీస్తూ నటుడిగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
అదండీ, తండ్రులు, తాతలు ఎంత పెద్ద నటులైనప్పటికీ సక్సెస్ కాలేకపోయినా వారసులు ఈ లిస్ట్ లో ఇంకా చాలామందే ఉన్నారనుకోండి!.
ఓలా స్కూటర్‌ను ధ్వంసం చేసిన ఓనర్.. కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..