ఈ పెర‌టి ఆకులు సౌంద‌ర్యాన్ని పెంచుతాయ‌ని తెలుసా?

చ‌ర్మ సౌంద‌ర్యాన్ని పెంచుకునేందుకు మ‌చ్చ‌లు, మొటిమ‌లు లేని మృదువైన చ‌ర్మాన్ని పొందేందుకు.

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రూ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.వేల‌కు వేలు ఖ‌ర్చు పెట్టి ర‌క‌ర‌కాల క్రీములు, లోష‌న్లు, మాయిశ్చ‌రైజ‌ర్లు, ఫేస్ సీరమ్‌లు కొనుగోలు చేసి వాడుతుంటారు.

కానీ, పైసా ఖ‌ర్చు లేకుండా పెర‌టిలో దొరికే ఆకుల‌తోనే సౌంద‌ర్యాన్ని పెంచుకోవ‌చ్చ‌న్న విష‌యాన్ని మాత్రం గ‌మ‌నించ‌రు.

అవును, పెర‌టింటి ఆకుల‌తోనే చాలా సులువుగా చ‌ర్మాన్ని మెరిపించుకోవ‌చ్చు.మ‌రి ఆ ఆకులు ఏంటీ ఎలా వాడాలి ? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

మెంతి ఆకు అంద‌రి పెర‌టిలోనూ విరి విరిగా ల‌భిస్తుంది.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మెంతి ఆకు డార్క్ స్పాట్స్‌ను నివారించి చ‌ర్మాన్ని కాంతివంతంగా మార్చ‌డంలో ఎఫెక్ట్‌గా ఉపయోగ‌ప‌డుతుంది.

అందుకోసం కొన్ని ఫ్రెష్‌గా ఉండే మెంతి ఆకుల‌ను మెత్త‌గా పేస్ట్ చేసి అందులో రోజ్ వాట‌ర్ మ‌రియు పెరుగు వేసి మిక్స్ చేసుకుని ముఖానికి అప్లై చేయాలి.

ప‌ది లేదా ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

/br. """/"/ అలాగే తుల‌సి అంద‌రి పెర‌టిలోనూ ఉంటుంది.

ముఖ్యంగా హిందువులు తుల‌సి మొక్క‌ను దైవంతో కొలుస్తారు.అయితే చ‌ర్మానికి కూడా తుల‌సి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి.ఇప్పుడు ఈ పొడిలో ఎగ్ వైట్ మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి.

పావు గంట త‌ర్వాత శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల‌ మురికి, మృత‌క‌ణాలు సులువుగా తొలగి పోవడమే కాకుండా చర్మం తెల్లగా మరియు ఫ్రెష్ గా మారుతుంది.

"""/"/ కొత్తిమీర కూడా అంద‌రి పెర‌టిలో ఉండేది.అయితే ఈ కొత్తిమీర ముడ‌త‌ల‌ను నివారించి క్లియ‌ర్‌ను స్కిన్‌ను అందించ‌డంలో సూప‌ర్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

కొత్తిమీరను తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి.అందులో క‌ల‌బంద జెల్ మిక్స్ చేయండి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పట్టించి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.