కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ శ్రమ్ కార్డులను కాచిగూడ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు...
TeluguStop.com
అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేసే విధంగా బీమా ప్రయోజనాలను చేకూర్చే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ శ్రమ్ కార్డులను కాచిగూడ డివిజన్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది .
దేశంలో ప్రతి కుటుంబానికి సొంత గృహం కలిగి ఉండి విడిగా టాయిలెట్లు ఉండాలనే ఉద్దేశంతో దేశి 11 వేల కోట్ల టాయిలెట్ నిర్మాణం చేపట్టడం జరిగింది.
అలాగే ప్రతి కుటుంబానికి విద్యుత్ కనెక్షన్ మరియు ఉజ్వల నిధి ద్వారా సిలిండర్ల పంపిణీ చేపట్టడం జరిగింది.
మూడు రూపాయలకే కేజీ బియ్యం చొప్పున దేశంలో ఉన్న 80 కోట్ల మంది ప్రజలకు అన్ని రాష్ట్రాలకు అందివ్వడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వం 31 రూపాయల సబ్సిడీ ఇస్తే వీటికి అదనంగా రాష్ట్రప్రభుత్వం రెండు రూపాయలు జోడించి ఒక్క రూపాయి సరఫరా చేస్తుంది.
అంతేకాకుండా కరోనా సమయంలో ప్రతి కుటుంబానికి అదనంగా 5 కేజీల బియ్యం పూర్తి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ తో పంపిణీ చేయడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి సంక్షేమ ఫలితము పేదలకు అందేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు.. డైరెక్టర్ శంకర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!