రోజూ ఉద‌యాన్నే ఈ జ్యూస్ తాగితే ఎలాంటి నీర‌సమైనా మ‌టాష్‌!

నీరసం.దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఆహారం స‌రిగ్గా తీసుకోక‌పోయినా, కంటి నిండా నిద్ర లేక‌పోయినా, ఎక్కువ సేపు ప‌ని చేసినా, ఒంట్లో ఏదైనా స‌మ‌స్య వ‌చ్చినా మొద‌ట ఇబ్బంది పెట్టేది నీర‌సమే.

అయితే ఒక్కోసారి నీర‌సం ప‌ట్టుకుందంటే అస్స‌లు వ‌దిలి పెట్ట‌దు.దీని దెబ్బ‌కు ఏ ప‌నీ చేయ‌లేక మంచానికే ప‌రిమితం అవ్వాల్సిన ప‌రిస్థితులూ ఏర్ప‌డుతుంటారు.

అందుకే నీర‌సాన్ని ఎంత త్వ‌ర‌గా వ‌దిలించుకుంటే అంత ఉత్సాహంగా, సంతోషంగా ఉండొచ్చు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే జ్యూస్‌ను తాగితే ఎలాంటి నీర‌స‌మైనా మ‌టాష్ అవ్వ‌డం ఖాయం.

మ‌రి లేటెందుకు ఆ జ్యూస్ ఏంటో.? ఎలా చేసుకోవాలో.

? చూసేయండి.ఒక గ్రీన్ యాపిల్‌, ఒక క్యారెట్, పీల్ తీసిన ఒక కివి.

మూడిటినీ తీసుకుని శుభ్రంగా క‌డిగి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో గ్రీన్ యాపిల్ ముక్క‌లు, క్యారెట్ ముక్క‌లు, కివి ముక్క‌లు వేసి జ్యూస్‌లా త‌యారు చేసుకోవాలి.

"""/"/ ఆ త‌ర్వాత ఈ జ్యూస్‌లో ఒక టేబుల్ నిమ్మ ర‌సం, ఒక టేబుల్ స్పూన్ అల్లం ర‌సం వేసుకుని బాగా క‌లుపుకోవాలి.

ఈ జ్యూస్‌ను ప్ర‌తి రోజూ ఉద‌యాన్నే ఒక గ్లాస్ చ‌ప్పున తీసుకుంటే నీర‌సం త‌గ్గ‌డ‌మే కాదు మ‌ళ్లీ మ‌ళ్లీ ద‌రి దాపుల్లోకి రాకుండా కూడా ఉంటుంది.

అలాగే ఈ జ్యూస్‌ను డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల.అందులోని శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ కిడ్నీల‌ను, లివ‌ర్‌ను శుభ్రంగా మారుస్తాయి.

ర‌క్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను క‌రిగించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.అంతే కాదు, ఈ జ్యూస్‌ను రోజూ తీసుకుంటే ర‌క్త హీన‌త స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.

కంటి ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.అతి ఆక‌లి దూరం అవుతుంది.

మ‌రియు మెద‌డు మ‌రింత వేగంగా, చురుగ్గా ప‌ని చేస్తుంది.

మహిళ లగేజీలో రూ.161 కోట్ల విలువైన డ్రగ్స్.. ఇందులో అసలు ట్విస్ట్ ఇదే..?