ఈ ఆహారాలకు బెల్లం జోడించి తీసుకుంటే.. మస్తు బెనిఫిట్స్!
TeluguStop.com
బెల్లం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు.అందుకే ఇటీవల కాలంలో చాలా మంది పంచదారకు బదులు బెల్లాన్ని వాడుతున్నారు.
బెల్లాన్ని డైలీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక జబ్బులకు కూడా దూరంగా ఉండొచ్చు.
పూర్వ కాలంలో విరి విరిగా ఉపయోగించే బెల్లంలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.
ప్రోటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోకెమికల్స్ ఇలా అనేక పోషకాలు బెల్లంలో ఉన్నాయి.
అటువంటి బెల్లాన్ని డైరెక్ట్‌గానే కాకుండా.ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్ పొందొచ్చు.
మరి ఆ ఆహారాలు ఏంటో ఓ లుక్కేసేయండి.ధనియాలు, బెల్లం.
ఈ రెండూ విడి విడిగా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి.మరియు పోషకాలు కూడా మెండుగా ఉంటాయి.
అటువంటి ధనియాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఇంకా మంచిది.ముఖ్యంగా ధనియాల పొడి, బెల్లం కలిపి అర స్పూన్ చొప్పున తీసుకుంటే కీళ్ల నొప్పులు, కడపు నొప్పి, తలనొప్పి వంటివి దూరంగా ఉంటాయి.
"""/" /
అలాగే నువ్వులు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల.అందులో ఉండే పోషకాలు శరీర రోగ నిరోధక శక్తిని పెంపొందించి సీజనల్‌గా వచ్చే రోగాల నుంచి రక్షణ కల్పిస్తుంది.
అలాగే నువ్వులు, బెల్లం కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య దూరం అవ్వడంతో పాటు ఎముకలు, కండరాలు బలంగా మారతాయి.
మెంతులు, బెల్లం.ఈ రెండింటి కాంబినేషన్ కూడా మనకు ఎంతగానో సహాయపడుతుంది.
ముఖ్యంగా హెయిర్ ఫాలో అధికంగా ఉండే వారు మెంతుల పొడి కొద్దిగా బెల్లం కలిపి తీసుకుంటే.
జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.మరియు మెంతులు, బెల్లం కలిపి తీసుకుంటే చర్మం కూడా ఎప్పుడూ నిగారింపుగా ఉంటుంది.
ఇక నోటి దుర్వాసన సమస్యతో ఇబ్బంది పడే వారు.ఒక స్పూన్ సోంపు మరియు బెల్లం కలిపి తీసుకోవాలి.
ఇలా తరచూ చేస్తే నోటి దుర్వాసన సమస్యే ఉండదు.అంతేకాదు, సోంపు మరియు బెల్లం కలిపి తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి.
వావ్.. గూగుల్‌లో వర్క్‌లైఫ్ అదుర్స్ కదూ.. టెక్కీ షేర్ చేసిన వీడియో వైరల్