ఇంట్లో చేసుకునే ఈ సీరమ్స్‌ను వాడితే..మొటిమల సమస్యే ఉండదట!
TeluguStop.com
ఈ మధ్య కాలంలో ఫేస్ క్రీములు, ఫేస్ మాస్కులు, మాయిశ్చరైజర్లు, లోషన్లు వంటివే కాకుండా సీరమ్ల వినియోగం కూడా బాగా పెరిగి పోయింది.
సీరమ్స్ వాడటం వల్ల చర్మం డ్రై అవ్వకుండా ఉంటుంది.మొటిమలు, మచ్చలు, ముడతలు తగ్గు ముఖం పడతాయి.
స్కిన్ సాఫ్ట్ స్మూత్‌గా మారుతుంది.ముడతల సమస్య దరి చేరకుండా ఉంటుంది.
అందు వల్లనే, స్త్రీ.పురుషులు అనే తేడా లేకుండా చాలా మంది సీరమ్స్ ను వాడటం అలవాటు చేసుకున్నారు.
వినియోగం పెరగడంతో మార్కెట్‌లోకి రకరకాల సీరమ్స్ అందు బాటులోకి వచ్చేస్తున్నాయి. """/" /
అయితే మార్కెట్‌లో లభించే సీరమ్స్ కంటే ఇంట్లో తయారు చేసుకునే సీరమ్స్ ద్వారా ఎక్కువ బెనిఫిట్స్ పొందొచ్చు.
పైగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.మరి లేటెందుకు ఇంట్లో తయారు చేసుకునే కొన్ని సీరమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా చాలా మందిని వేధించే చర్మ సమస్యల్లో మొటిమలు ముందుంటాయి.అయితే మొటిమలతో బాధ పడే వారు.
ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల కలబంద జెల్, అర స్పూన్ కస్తూరి పసుపు, నాలుగు స్పూన్ల జొజోబా ఆయిల్‌ను వేసి బాగా కలిపి సీసాలో భద్రపరుచుకోవాలి.
నిద్ర పోయే ముందు ఈ న్యాచురల్ సీరమ్‌ను మొటిమలపైనే కాకుండా ముఖం మొత్తానికి అప్లై చేసి ఉదయాన్నే గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.
ఇలా కొన్ని రోజులు పాటు చేస్తే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి.
మరియు స్కిన్ గ్లోగా మెరుస్తుంది. """/" /
ఇక ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ విటమిన్ సి పౌడర్, ఆరు స్పూన్ల రోజ్ వాటర్, అర స్పూన్ విటమిన్ ఇ ఆయిల్ మరియు ఒక స్పూన్ గ్లిజరిన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
అపై ఈ మిశ్రమాన్ని ఓ బాటిల్‌లో నింపుకోవాలి.రోజూ రాత్రి నిద్రించే ముందు ఈ సీరమ్‌ను ముఖానికి అప్లై చేసుకుని.
ఉదయాన్నే వాటర్‌తో వాష్ చేసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముడతల సమస్య ఉండదు.
స్కిన్ టోన్ మెరుగు పడుతుంది.మరియు చర్మం ఎల్లప్పుడూ తేమగా, మృదువుగా ఉంటుంది.
ఈ సింపుల్ రెమెడీతో దృఢమైన ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి!