ఈ టాలీవుడ్ హీరోయిన్స్ అందరికి పిలిచి మరి అవకాశం ఇచ్చారు !
TeluguStop.com
ఈ కాలంలో ఒక హీరోయిన్ అవ్వాలంటే లేదా ఒక మంచి గుర్తింపు ఉన్న పాత్ర దొరకాలి అన్నా కూడా చాలా కష్టంతో కూడుకున్న పని.
అంతా కలిసి వచ్చి ఒక అవకాశం దొరికినా కూడా అది హిట్ అవుతుందో కూడా తెలియదు.
అలాంటి పరిస్థితులలో కొంత మంది టాలీవుడ్ హీరోయిన్స్ చాలా అలవోకగా మంచి సినిమా అవకాశాలు దక్కించుకొని టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్స్ గా చలామణి అవుతున్నారు.
మరి అలా పిలిచి మరి హీరోయిన్స్ గా చేయబడ్డ ఆ నటి మణులు ఎవరు ? వారు నటించిన ఆ సినిమాలు ఏంటి అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
H3 Class=subheader-styleమీనాక్షి చౌదరి/h3p """/" /
ప్రస్తుతం టాలీవుడ్ లో లీడింగ్ స్టార్ హీరోయిన్ గా ఉంది మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ).
అయితే ఈమె హీరోయిన్ అవ్వాలి అనుకోలేదు.ఒక ఈవెంట్ లో ఉన్న ఆమెను చూసిన మన టాలీవుడ్ హీరో సుశాంత్ తాను తీయబోయే ఇచట వాహనములు ఆపరాదు అనే సినిమా కోసం ఆమెను చూడగానే మీనాక్షి అయితే బాగుంటుంది అని ఆమెను టాలీవుడ్ లో నటించడం ఇష్టమేనా అని అడిగారట.
తను కూడా ఓకే చెప్పడంతో హీరోయిన్ అయిపోయింది.ప్రస్తుతం ఆమె చేతిలో మంచి సినిమాలు ఉన్నాయి.
H3 Class=subheader-styleరష్మిక మందన్న/h3p """/" /
నేషనల్ క్రష్ రష్మిక ( Rashmika Mandanna )ఎంట్రీ కూడా చాలా గమ్మత్తుగా సాగింది ఆమె ఫోటో ఉన్న ఒక మ్యాగజిన్ చూసిన కన్నడ స్టార్ డైరెక్టర్ రక్షిత్ శెట్టి( Rakshit Shetty ) ఆమెను హీరోయిన్ గా పెట్టి కిరాక్ పార్టీ అనే సినిమాను తీశారు.
ఆ సినిమా హిట్ అవ్వడం, ఆ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ కు రావడం, ప్రస్తుతం ప్యాన్ ఇండియా హీరోయిన్ గా ఆమె దుమ్ము దులపడం అన్ని చాలా ఈజీగా జరిగిపోయాయి.
H3 Class=subheader-styleసాక్షి విద్య/h3p """/" /
ఇంస్టాగ్రామ్ లోకి కేవలం రీల్స్ మాత్రమే చేసుకునే సాక్షి విద్య( Sakshi Vaidya ) ఏకంగా టాలీవుడ్ లో హీరోయిన్ అయిపోయింది.
అక్కడ ఆమెకు ఉన్న పాపులారిటీ చూసి డైరెక్టర్ తన ఏజెంట్ సినిమాలో హీరో అఖిల్ పక్కన హీరోయిన్ గా తీసుకున్నారు.
H3 Class=subheader-styleఫరియా అబ్దుల్లా/h3p
జాతి రత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా( Faria Abdullah ) అలియాస్ చిట్టి ఎంట్రీ కూడా ఇలా అనుకోకుండానే జరిగింది.
ఒక కాలేజ్ ఫంక్షన్ లో ఫరియా ను చూసిన నాగ్ అశ్విన్ తన నిర్మాణంలో వచ్చిన జాతి రత్నాలు సినిమాలో ఈమె అయితే బాగుంటుంది అని అనుకోని ఫరియా ను ఎంచుకోవడం జరిగింది.
పడిపోతున్న కుక్కను సినిమా స్టైల్లో కాపాడిన దేవత.. రియల్ హీరోయిన్ అంటే ఈమే!