వచ్చే సంవత్సరం అయినా ఈ భామలు జనాలను పలకరిస్తారా?
TeluguStop.com
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల పరిస్థితి హీరోలకంటే చాలా భిన్నంగా ఉంటుంది.ఇక్కడ పేరు తెచ్చుకున్న హీరోలకు ఎటువంటి ఢోకా ఉండదు.
కానీ హీరోయిన్ల పరిస్థితి వేరు.ఎంత పెద్ద పేరు తెచ్చుకున్నప్పటికీ అది కొంతకాలమే నడుస్తుంది.
ఆ తరువాత కొంత కాలానికి తమకి తెలియకుండానే సర్దేస్తారు.అయితే కొందరి విషయం అలా కాదు.
అవకాశాలు తగ్గుతున్నప్పటికీ, ప్రేక్షకులు వారి సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు.అలాంటివారిలో అనుష్క, పూజ హెగ్డే, సమంత, శృతి హాసన్, మరియు నయనతార( Anushka, Pooja Hegde, Samantha, Shruti Haasan, Nayanthara ) వంటి హీరోయిన్లు ఉన్నారు అని చెప్పుకోవడంలో సందేహమే లేదు!.
వీరిలో హీరోయిన్ అనుష్క పరిస్థితి చాలా ప్రత్యేకమైనది.మొదటినుండీ, బడా హీరోల సరసన చేసిన అనుష్క పెద్ద పెద్ద సినిమాలను చేస్తూ, తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకుంది.
అందుకే ఆమె సినిమాల కోసం ఓ వర్గం వారు ఎదురు చూస్తూ ఉంటారు.
అనుష్క 'మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి'( Miss Shetty, Mr Polishetty' ) తరువాత దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాను అంగీకరించింది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం జనాలను పలకరించనుంది.ప్రస్తుతానికైతే ఈ సినిమానుండి ఎటువంటి అప్డేట్స్ లేవు.
"""/" /
ఇక హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే.గత కొంతకాలంగా మాయోసైటిస్ ( Myositis )అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్న ఈమె ఇపుడిపుడే కోలుకొని షూటింగులతో పాల్గొంటుంది.
ఈమె ఫాలోయింగ్ గురించి కూడా తెలిసినదే.గత కొంతకాలంగా సమంత హీరోలతో పనిలేని సినిమాలు.
హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలనే ఒప్పుకుంటూ తన ఉనికిని చాటుకుంటోంది.సామ్ ఈమధ్య ఎక్కువగా బాలీవుడ్లో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ల వైపు మొగ్గు చూపుతున్నట్టు కనబడుతోంది.
ఈ క్రమంలోనే ఫామిలీ మ్యాన్, సిడాటెల్ అనే సిరీస్ లలో నటించింది.వచ్చే సంవత్సరం అయినా సామ్ బుల్లితెర కాకుండా, వెండితెరపై అలరించాలి అని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
"""/" /
ఇక పూజ హెగ్డే, శృతి హాసన్, మరియు నయనతార పరిస్థితి కూడా అదే.
నయనతార టాలీవుడ్లో అడపాదడపా సినిమాలను చేస్తుంది.కానీ, పూజ హెగ్డే, శృతి హాసన్ ఎక్కడ సినిమాలు చేసినా, టాలీవుడ్ వారికి చాలా ప్రత్యేకమనే చెప్పుకోవాలి.
పూజ హెగ్డే, శృతి హాసన్ ఇక్కడ మొన్నటి వరకు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి హిట్లు ఇచ్చారు.
ఈ సంవత్సరం అయితే వీరు మచ్చుకైనా తెరపై కనబడలేదు.వచ్చే సంవత్సరం అయినా వీరు తమ సినిమాలతో జనాలను అలరించాలని కోరుకుందాం!.