Junior NTR , Mahesh Babu, Charan : రాజకీయాల్లోకి రాకపోయినా ఎంట్రీ ఇస్తే సంచలనాలు సృష్టించే సత్తా ఉన్న తెలుగు హీరోలు వీళ్లే!

ఏపీలో ఎన్నికలకు ఎంతో సమయం లేదు.ఒక్కో సర్వేలో ఒక్కో పార్టీకి అనుకూలంగా ఫలితాలు వస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు ఎన్నికల్లో ప్రచారానికి దూరంగా ఉన్నారు.అయితే రాజకీయాల్లోకి రాకపోయినా ఎంట్రీ ఇస్తే సంచలనాలు సృష్టించే సత్తా ఉన్న తెలుగు హీరోలు వీళ్లేనంటూ కొంతమంది హీరోల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ జాబితాలో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) ముందువరసలో ఉన్నారు.తారక్ టీడీపీ తరపున ప్రచారం చేసినా పూర్తిస్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టిన సందర్భాలు అయితే లేవు.

తారక్ వాగ్ధాటికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి( Politics ) వస్తే ఎప్పటికైనా సంచలనాలు సృష్టించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయాలపై ఆసక్తి ఉన్నా కొన్ని కారణాల వల్ల తారక్ పాలిటిక్స్ పై దృష్టి పెట్టడం లేదు.

"""/" / మహేష్ బాబు, చరణ్( Mahesh Babu, Charan ) మాత్రం పాలిటిక్స్ పై ఆసక్తి ఉన్నట్టు ఎప్పుడూ వ్యవహరించలేదు.

ప్రభాస్ కు కూడా రాజకీయాలపై ఆసక్తి లేకపోయినా ప్రభాస్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తే సంచలనాలు సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ప్రభాస్ వివాదాలకు దూరంగా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్న నేపథ్యంలో రాజకీయాల విషయంలో ప్రభాస్ ( Prabhas ) అభిప్రాయం ఎలా ఉందో చూడాలి.

ప్రభాస్ పెద్దమ్మ ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారని తెలుస్తోంది. """/" / మరోవైపు అల్లు అర్జున్( Allu Arjun ) సైతం రాజకీయాలకు దూరంగా ఉన్నా 2009 సంవత్సరం సమయంలో ప్రజారాజ్యం తరపున బన్నీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఇతర పార్టీల విమర్శలకు ధీటుగా బదులివ్వగల ప్రతిభ బన్నీలో ఉంది.మరి ఈ హీరో రాజకీయాలపై దృష్టి పెడతారో లేదో చూడాలి.

జనసేన పార్టీలో పవన్ ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టగా 24 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న జనసేనకు ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి.

లాస్ ఏంజిల్స్‌లో గొడవ.. లేడీ బస్సు డ్రైవర్‌పై భౌతిక దాడి..