ఈ అల‌వాట్లు ఉంటే క్యాన్స‌ర్ ముప్పు పెర‌గ‌డం ఖాయం..జాగ్ర‌త్త‌!

క్యాన్స‌ర్.ఎంతటి ప్రాణాంత‌క వ్యాధో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్పాల్సిన ప‌ని లేదు.

మ‌నిషిని శారీర‌కంగానే కాదు ఆర్థికంగానూ తీవ్రంగా దెబ్బ తీసే ప్ర‌మాద‌క‌ర‌మైన వ్యాధి ఇది.

ప్ర‌స్తుత రోజుల్లో క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిపోతోంది.మ‌ర‌ణాలు సైతం అంత‌కంత‌కు రెట్టింపు అవుతున్నాయి.

ముఖ్యంగా మ‌న దేశంలో గుండె జ‌బ్బుల త‌ర్వాత క్యాన్స‌ర్ వ్యాధి వ‌ల్ల‌నే ఎక్కువ శాతం మంది మృత్యువాత ప‌డుతున్నారు.

అందుకే వ‌చ్చాక బాధ ప‌డ‌టం కంటే.రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం ఎంతో మేల‌ని నిపుణులు చెబుతుంటారు.

అయితే క్యాన్స‌ర్ ముప్పు పెర‌గ‌డానికి మ‌న‌కు ఉండే కొన్ని కొన్ని అల‌వాట్లు కూడా కార‌ణం అవుతుంటాయి.

మ‌రి ఆ అల‌వాట్లు ఏంటో తెలుసుకుని.వాటిని స‌రిచేసుకుంటే క్యాన్స‌ర్ వ్యాధి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

సాధార‌ణంగా చాలా మంది ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు సాయంత్రం ప‌డుకునే వ‌ర‌కు మొబైల్ ఫోన్‌తోనే గ‌డుపుతుంటారు.

కొంద‌రైతే రాత్రుళ్లు నిద్ర మానేసి మ‌రీ ఫోన్‌లో లీన‌మ‌వుతుంటారు.ఈ అల‌వాటు మీకూ ఉందా.

అయితే మీరూ డేంజ‌ర్‌లో ప‌డిన‌ట్లే.ఎందుకంటే, ఎక్కువసేపు మొబైల్‌ని యూజ్ చేయ‌డం వల్ల దాని నుండి వెలువ‌డే రేడియేష‌న్ క్యాన్స‌ర్ ముప్పును పెంచుతుంది.

అందుకే ఫోన్‌ను ఎంత త‌క్కువ వాడితే ఆరోగ్యానికి అంత మంచిది.అలాగే గంట‌లు త‌ర‌బ‌డి కూర్చునే ఉండ‌టం.

ఎంద‌రికో ఉండే అల‌వాటు ఇది.ఏ ప‌ని చేయ‌కుండా ఎప్పుడూ కూర్చునే ఉంటే పెద్దప్రేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటివి వ‌చ్చే ప్ర‌మాదం పెరుగుతుంది.

కాబ‌ట్టి, శ‌రీరానికి శ్ర‌మ ఎంతో అవ‌స‌రం. """/"/ కొంద‌రు చిన్న చిన్న విష‌యాల‌కు కూడా ఒత్తిడికి గుర‌వుతుంటారు.

ఈ అల‌వాటును త‌ప్ప‌నిస‌రిగా మార్చుకోవాలి.లేదంటే క్యాన్స‌ర్ వ‌చ్చే రిస్క్ పెర‌గ‌డ‌మే కాదు అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు సైతం త‌లెత్తుతాయి.

ఇక ఎక్కువ సేపు కూర్చోవడం, నోటికి ఆపు లేకుండా ఏవి ప‌డితే అవి తిన‌డం, శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుకోక‌పోవ‌డం వంటి అల‌వాట్ల వ‌ల్లా క్యాన్స‌ర్ ముప్పు పెరుగుతుంది.

జాగ్ర‌త్త‌!.

చనిపోతూ కూడా ఈ హీరోయిన్స్ వారి కుటుంబ సభ్యులకి ఎన్ని కోట్ల ఆస్తి ఇచ్చారో తెలుసా ?