భోజనం తర్వాత ఈ ఆకులు తింటే..అజీర్తి, గ్యాస్ సమస్యలే ఉండవట?
TeluguStop.com
నేటి కాలంలో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా చాలా మంది అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలతో నానా ఇబ్బందులు పుడుతున్నారు.
టైమ్‌కి తినకపోవడం, జీర్ణ వ్యవస్థ పని తీరు మందగించడం, మద్యపానం, ధూమపానం, ఆహారపు అలవాట్లు ఇలా రకరకాల కారణాల జీర్ణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు టక్కున ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు.కానీ, న్యాచురల్‌గా కూడా జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఆకులను భోజనం తర్వాత తీసుకుంటే అజీర్తి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు దరి చేరకుండా ఉంటాయి.
మరి ఆ ఆకులు ఏంటో లేట్ చేయకుండా చూసేయండి వాము ఆకుల జీర్ణ శక్తిని పెంచడంలోనూ, జీర్ణ సమస్యలను దూరంగా చేయడంలోనూ ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి.
అందువల్ల, భోజనం చేసిన తర్వాత ఒకటి లేదా రెండు వాము తీసుకుని బాగా నమిలి మింగేయాలి.
ఇలా చేస్తే గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. """/"/
అలాగే తులిసి ఆకులు కూడా జీర్ణ సమస్యలకు చెక్ పెట్టడంలో గ్రేట్‌గా సహాయపడతాయి.
అందువల్ల భోజనం తర్వాత నాలుగైదు తులసి ఆకులను నమిలి మింగడం లేదా తులసి ఆకులను నుంచి తీసుకున్న రసాన్ని రెండు స్పూన్ల చప్పున్న తీసుకోవడం చేయాలి.
ఇలా చేసినా మంచి ఫలితంగా ఉంటుంది. """/"/
ఇక చాలా మంది కూరల్లో వచ్చే కరివేపాకులను తీసి పరేస్తుంటారు.
అయితే జీర్ణ సమస్యలను నివారించడంలో కరివేపాకు అద్భుతంగా సహాయపడుతుంది.ముఖ్యంగా భోజనం తర్వాత కరివేపాకు కొద్దిగా తీసుకుని బాగా నమిలి మింగేస్తే అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
అలాగే భోజనం తర్వాత తమలపాకు లేదా పుదీనా తీసుకున్నా జీర్ణ సమస్యలకు దూరంగా ఉండొచ్చు.
రామ్ చరణ్ బుచ్చిబాబు మీద అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి గల కారణం ఏంటి..?