ఈ పండ్లను జుట్టుకు పట్టిస్తే హెయిర్ ఫాల్ సమస్యే ఉండదు!
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య హెయిర్ ఫాల్.
ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.ఏవేవో ప్రయోగాలు సైతం చేస్తారు.
ఏవీ మంచి ఫలితాన్ని ఇవ్వకుంటే తెగ చింతిస్తూ ఉంటారు.అయితే హెయిర్ ఫాల్‌కు అడ్డు కట్ట వేయడంలో కొన్ని కొన్ని పండ్లు గ్రేట్‌గా సహాయపడతాయి.
మరి ఆ పండ్లు ఏంటీ.? వాటిని హెయిర్‌కు ఎలా ఉపయోగించాలి.
? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.దానిమ్మ ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగానే కాకుండా కేశ సంరక్షణలోనూ ఉపయోగపడుతుంది.
ఒక బౌల్ తీసుకుని అందులో నాలుగు స్పూన్ల దానిమ్మ జ్యూస్, రెండు స్పూన్ల కొబ్బరి పాలు, రెండు విటమిన్ ఇ క్యాప్సుల్స్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి.గంట అనంతరం కెమికల్స్ లేని షాంపూతో తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే హెయిర్ ఫాల్ క్రమక్రమంగా తగ్గుతుంది.అలాగే బాగా పండిన అరటి పండును తీసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక స్పూన్ వెన్న, ఒక స్పూన్ తేనె వేసుకుని కలుపుకోవాలి.
"""/" / ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి గంట పాటు షవర్ క్యాప్ పెట్టుకోవాలి.
అనంతరం గోరు వెచ్చని నీటితో హెడ్ బాత్ చేయాలి.ఇలా చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇక మూడు లేదా నాలుగు స్ట్రాబెర్రీలను తీసుకుని పేస్ట్ చేసి రసం తీసుకోవాలి.
ఇప్పుడు ఒక బౌల్‌లో రెండు స్పూన్ల ముల్తానీ మట్టి, ఒక స్పూన్ పాలు మరియు మూడు స్పూన్ల స్ట్రాబెర్రీ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి.
ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించి నలబై నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది.
నేషనల్ అవార్డ్ కోసం ఎదురుచూస్తున్నానన్న సాయిపల్లవి.. ఆ అదృష్టం వరిస్తుందా?