పండ్ల ర‌సాల‌తో పింపుల్స్‌కు బై బై చెప్పేయండిలా!

యువ‌తీ, యువ‌కుల‌ను ప్ర‌ధానంగా వేధించే చ‌ర్మ స‌మ‌స్యల్లో పింపుల్స్ ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

చ‌ర్మంపై అధిక జిడ్డు ఉత్ప‌త్తి కావ‌డం, డెడ్ స్కిన్ సెల్స్‌, హార్మోన్ ఛేంజ‌స్‌, ఫ్యాటీ ఫుడ్స్ అధికంగా తీసుకోవ‌డం, పోష‌కాల కొర‌త‌, కొన్ని రకాల క్రీమ్స్ వాడ‌కం, గంట‌లు త‌ర‌బ‌డి ఫోన్ మాట్లాడ‌టం వంటి ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మొటిమ‌లు ఏర్ప‌డుతూ ఉంటాయి.

ఏదేమైనా చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని ఒక చిన్న మొటిమ పాడు చేస్తే ఎంత బాధగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

అందుకే పింపుల్స్‌ను వ‌దిలించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.ఖ‌రీదైన పింపుల్ రిమూవ‌ల్ క్రీమ్స్ వాడుతుంటారు.

కానీ, న్యాచుర‌ల్ ప‌ద్ధ‌తుల్లోనూ మొద‌టిల‌కు బై బై చెప్ప‌వ‌చ్చు.అందుకు కొన్ని పండ్ల ర‌సాలు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి ఆ పండ్ల ర‌సాలు ఏంటీ వాటిని చ‌ర్మానికి ఎలా వాడాలి వంటి విష‌యాల‌ను ఏ మాత్రం లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

"""/"/ పింపుల్స్‌ను సూప‌ర్ ఫాస్ట్‌గా త‌గ్గించ‌డానికి దానిమ్మ ర‌సం అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.రెండు టేబుల్ స్పూన్ల దానిమ్మ ర‌సంలో హాఫ్ టేబుల్ స్పూన్ ప‌సుపు క‌లిపి.

మొటిమ‌లు ఉన్న చోట అప్లై చేయాలి.బాగా డ్రై అయిన త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.

రోజుకు రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుందిస్ట్రాబెర్రీ ర‌సంతోనూ మొటిమ‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు.

వ‌న్ టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ జ్యూస్‌కి వ‌న్ టేబుల్ స్పూన్ పుదీనా జ్యూస్‌ను యాడ్ చేసి.

దూది సాయంతో అప్లై చేసుకోవాలి.త‌ర‌చూ ఇలా చేసినా కూడా మొటిమ‌లు త్వ‌ర‌గా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి ఇక ఆరెంజ్ జ్యూస్‌ను డైరెక్ట‌ర్‌గా మొటిమ‌లపై అప్లై చేసుకుని.

ఇర‌వై నిమిషాల అనంత‌రం కూల్‌ వాట‌ర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేసినా పింపుల్స్ నుంచి విముక్తి ల‌భిస్తుంది.

దేవర పోస్టర్ పై భారీ ట్రోల్స్… ఆ హీరోల సినిమాలను కాపీ కొట్టారంటూ కామెంట్స్!