యువతలో డయాబెటిస్ రిస్క్ తగ్గాలంటే ఈ 4 నియమాలు తప్పనిసరి!
TeluguStop.com
డయాబెటిస్.దీనినే మధుమేహం అని కొందరు, షుగర్ వ్యాధి అని మరి కొందరు పిలుస్తుంటారు.
దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది ఒకటి.ఇంతకు ముందు అరవై, డెబ్బై ఏళ్లు దాటిన వారికి డయాబెటిస్ వచ్చేది.
కానీ, ప్రస్తుత రోజుల్లో యువత సైతం డయాబెటిస్‌కి గురవుతున్నారు.ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవన శైలిలో వచ్చే మార్పులు, చెడు అలవాట్లు వంటివే ఇందుకు ప్రధాన కారణాలు.
అయితే ఇప్పుడు చెప్పబోయే నాలుగు నియమాలను తప్పని సరిగా పాటిస్తే యువతలో అంతకంతకు పెరిగి పోతున్న మధుమేహ ముప్పును తగ్గించవచ్చు.
మరి ఆ నియమాలు ఏంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి,
మధుమేహం రాకుండా ఉండాలంటే చక్కెర మరియు కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉన్న ఆహారాలను తినడం పూర్తిగా తగ్గించుకోవాలి.
ఎందుకంటే, వీటి వల్లే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.ఫలితంగా మధుమేహం బారిన పడతారు.
కాబట్టి, యువత ఇకపై ఆయా ఆహారాలను డైట్ నుంచి కట్ చేసి విటమిన్లు, మినరల్స్, ఫైబర్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండే ఫుడ్స్‌ను యాడ్ చేసుకోవాలి.
వ్యాయామం.యువతలో డయాబెటిస్ రిస్క్‌ను తగ్గించడంలో ఇది అద్భుతంగా సహాయపడుతుంది.
అలా అని ప్రతి రోజు వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు.వారంలో ఐదు రోజులు చేస్తే చాలు.
మధుమేహానికి దూరంగా ఉండొచ్చు. """/" /
మద్యపానం, ధూమపానం.
ఈ రెండూ ఆరోగ్యానికి హానికరమని అందరికీ తెలుసు.అయినప్పటికీ.
ఇటీవల కాలంలో వాటికే యువత బానిసగా మారుతోంది.అయితే ఈ చెడు అలవాట్ల కారణంగా కూడా డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
సో.మద్యపానం, ధూమపానం అలవాట్లకు ఎంత దూరంగా ఉంటె అంత మంచిది.
ఈ మధ్య యువతీ, యువకులు స్మార్ట్ ఫోన్లతో సమయాన్ని గడిపేస్తూ నిద్రను నిర్లక్ష్యం చేసున్నారు.
దాంతో ఒత్తిడి పెరిగి.చివరకు మధుమేహానికి దారి తీస్తుంది.
అందువల్ల, సరైన సమయానికి పడుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి.కంటి నిండా నిద్ర ఉంటే సగానికి పైగా అనారోగ్య సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్30, శనివారం 2024