మ‌తిమ‌రుపు బాధిస్తుందా.. ఈ ఆహారాలతో జ‌ర జాగ్ర‌త్త‌!

మ‌తిమ‌రుపు.యాబై, అర‌వై ఏళ్లు దాటిన వారిలో ఈ స‌మ‌స్య క‌నిపించ‌డం స‌ర్వ సాధార‌ణం.

కానీ, ఇటీవ‌ల కాలంలో ఇర‌వై, ముప్పై ఏళ్ల వారిలో మ‌తిమ‌రుపు స‌మ‌స్య క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఇందుకు చాలా కార‌ణాలు ఉన్నాయి.ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, మ‌ద్య‌పానం, ధూమ‌పానం, పోష‌కాల లోపం, అధిక ఒత్తిడి, ఆందోళ‌న‌, ఏదో తెలియ‌ని క‌ల‌వ‌రం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు త‌గ్గుతుంది.

దాంతో జ్ఞాపకశక్తి లోపించ‌డంతో పాటు ఏకాగ్ర‌త కూడా దెబ్బ తింటుంది.ఇలాంటి స‌మ‌యంలో త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా కూడా ఉండాలి‌.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.ఆయిల్ ఫుడ్స్‌, ఫ్రైస్ వంటి వాటిని ఎంత ఎవైడ్ చేస్తే అంద మంచిది.

వీటి వ‌ల్ల శ‌రీరానికి పెద్ద‌గా పోష‌కాలు అంద‌క‌పోగా.మ‌తిమ‌రుపుకు ఏర్పడటానికి కారణమయ్యే బీటా అమైలాయిడ్ అనే విషతుల్య ప్రోటీన్లు కూడా ఇందులో ఉంటాయి.

"""/" / అలాగే మ‌తి మ‌రుపు ఉన్న వారు రెడ్ మీట్‌కు కూడా దూరంగా ఉండాలి.

ఎందుకంటే రెడ్ మీట్‌లో ఐర‌న్ అత్య‌ధికంగా ఉంటుంది.ఐర‌న్ ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ.

శ‌రీరానికి కావాల్సిన దాని కంటే ఎక్కువ‌గా తీసుకుంటే మాత్రం మ‌తిమ‌రుపు స‌మ‌స్య ఏర్పడుతుంది.

ఇక పాప్ ‌కార్న్‌ను చాలా మంది ఇష్టంగా తింటుంటారు.సినిమా చూసే స‌మ‌యంలో, ఫ్రీగా ఉన్న స‌మ‌యంలో చాలా మంది పాప్ కార్న్‌నే ఎంచుకుంటారు.

కానీ, మ‌తిమ‌రుపు లేదా ఇత‌ర మెదడు స‌మ‌స్య‌లు ఉన్న వారికి పాప్ కార్న్ మంచిది కాద‌ని నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా మైక్రోవేవ్‌లో పెట్టి తయారు చేసే పాప్ కార్న్ మాత్రం అస్సలు తిన‌రాద‌ని అంటున్నారు.

ఇక వీటిలో పాటు పంచ‌దార‌తో త‌యారు చేసిన స్వీట్స్‌, ఫాస్ట్ ఫుడ్స్‌, మైదా పిండితో చేసే ఆహారాలను కూడా ఎవైడ్ చేయాలి.

మ‌ద్యపానం, ధూమ‌పానానికి దూరంగా ఉండాలి.

ప్రశాంత్ మూవీ కోసం ఆ రాష్ట్రానికి వెళ్లనున్న ఎన్టీఆర్.. తొలిసారి అలా చేస్తున్నారా?