లివ‌ర్‌ను దెబ్బ‌తీసే ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉంటున్నారా?

లివ‌ర్ (కాలేయం) ఇది మ‌న శ‌రీరంలో అతి పెద్ద అవ‌య‌వ‌మే కాదు అత్యంత కీల‌కమైన‌ అవ‌య‌వం కూడా.

రక్తాన్ని శుద్ధి చేయ‌డం, ఒంట్లో చేరే విషాల్ని విరిచేసి బయటికి వెళ్ల గొట్టడం, పోషకాలను నిల్వ చేయడం ఇలా ఎన్నో పాత్ర‌ల‌ను లివ‌ర్ పోషిస్తుంది.

అలాగే లివ‌ర్‌కి ఉన్న మ‌రో గొప్ప సామ‌ర్థ్యం ఏంటంటే మూడు వంతులు పాడైపోయి కేవ‌లం పావు వంతే మిగిలి ఉన్నా తనని తాను తిరిగి బాగుచేసుకోగ‌ల‌దు.

అయితే ఆరోగ్యాన్ని ఎల్ల‌ప్పుడూ పర్యవేక్షిస్తూ, శరీరం మొత్తాన్ని సంరక్షిస్తూ ఉండే కాలేయాన్ని దెబ్బ తీసే ఆహారాలు కొన్ని ఉన్నాయి.

ఆ ఆహారాలకు దూరంగా ఉంటేనే లివ‌ర్ హెల్తీగా ఉంటుంది.మ‌న‌ల్ని హెల్తీగా ఉంచుతుంది.

మ‌రి లేటెందుకు ఆల‌స్యం చేయ‌కుండా ఆ ఫుడ్స్ ఏంటో చూసేయండి.సాధార‌ణంగా చాలా మంది ఫ్రెంచ్ ఫ్రైస్, పకోడీలు, బ‌జ్జీలు, సమోసాలు వంటి ఆహారాల‌ను త‌ర‌చూ తింటుంటారు.

నూనెలో వేయించ‌డం వ‌ల్ల ఇటువంటి ఆహారాలు ఎంతో రుచిగా ఉంటాయి.కానీ, ఇవి లివ‌ర్ ఆరోగ్యానికి తీవ్రంగా నాశ‌నం చేస్తాయి.

షుగ‌ర్ మ‌రియు షుగ‌ర్‌తో త‌యారు చేసిన ఆహారాలూ లివ‌ర్‌కు ఏ మాత్రం మంచివి కావు.

ప‌రిమితికి మించి షుగ‌ర్‌, షుగ‌ర్ ఫుడ్స్ తీసుకుంటే లివ‌ర్ చుట్టూ కొవ్వు పేరుకుపోయి క్ర‌మ‌క్ర‌మంగా డ్యామేజ్ అయిపోతుంది.

అలాగే పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ కూల్ డ్రింక్స్‌ను అమితంగా ఇష్ట‌ప‌డి తాగుతుంటారు.

కానీ, కూల్‌ డ్రింక్స్‌లో ఉండే కొన్ని హానిక‌ర‌మైన పదార్థాలు లివ‌ర్ ప‌ని తీరును మంద‌గించేలా చేస్తాయి.

"""/" / కాలేయ ఆరోగ్యానికి దెబ్బ తీయ‌డంలో ఉప్పు కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

అవును, అతిగా ఉప్పు తీసుకుంటే అందులోని సోడియం కంటెంట్ లివర్ ఫెయిల్యూర్ కు కారణమవుతుంది.

బ‌ర్గ‌ర్లు, పిజ్జాలు, కేకులు, బ్రెడ్స్‌, పాస్తా వంటి ఆహారాలు సైతం లివ‌ర్ ప‌ని తీరును త‌గ్గిస్తాయి.

కాబ‌ట్టి, ఇక‌పై కాలేయాన్ని రక్షించుకోవడం కోసం ఇటువంటి ఆహారాలకు దూరంగా ఉండండి.

CM Jagan : రెండో రోజు బస్సు యాత్రలో చంద్రబాబుపై సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు..!!