వర్షాకాలంలో ఈ ఆహారాలు డైట్ లో ఉంటే జలుబు, దగ్గు దరిదాపుల్లోకి కూడా రావు!

ప్రస్తుత వర్షాకాలంలో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ అత్యధికంగా వేధించే సమస్యల్లో జలుబు, దగ్గు ముందు వరుసలో ఉంటాయి.

ఇంట్లో ఒకరికి జలుబు, దగ్గు( Cough ) పట్టుకున్నాయంటే మిగిలిన వారికి కూడా సులభంగా వ్యాప్తి చెందుతాయి.

పైగా జలుబు( Cold ), దగ్గు వల్ల ఒక్కోసారి జ్వరం కూడా వస్తుంటుంది.

దీంతో ఆయా సమస్యల నుంచి బయటపడేందుకు ముప్పతిప్పలు పడుతుంటారు.అయితే జలుబు, ద‌గ్గు వచ్చాక బాధపడటం కంటే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.

"""/" / ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు ఈ సీజన్లో జలుబు, దగ్గు సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి అద్భుతంగా సహాయపడతాయి.

మరి ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.వెల్లుల్లి( Garlic ).

ప్రస్తుతం వర్షాకాలంలో దీన్ని కచ్చితంగా తీసుకోవాలి.రోజు ఉదయం 2 వెల్లుల్లి రెబ్బల‌ను తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి తేనెలో ముంచి తినాలి.

ఇలా కనుక చేస్తే ఇమ్యూనిటీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది.దాంతో జలుబు, దగ్గుతో సహా తదితర సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వర్షాకాలంలో జలుబు, దగ్గు నుంచి రక్షణ అందించే ఆహారాల్లో క్యాప్సికమ్‌( Capsicum ) ఒకటి.

అందుకే వారానికి కనీసం మూడు సార్లు అయినా క్యాప్సికమ్ ను తీసుకోవడానికి ప్రయత్నించాలి.

వర్షాకాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఆహారాల్లో బొప్పాయి పండు ముందు వ‌రుస‌లో ఉంటుంది.బొప్పాయి( Papaya )లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.జలుబు దగ్గు సమస్యలు రాకుండా అడ్డుకట్ట వేస్తాయి.

"""/" / పసుపు( Turmeric ).దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అనేక ఔషధ గుణాలు కలిగి ఉండే పసుపును నిత్యం తీసుకోవాలి.పసుపులో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి అవసరమయ్యే శక్తిని అందిస్తాయి.

రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.ఫలితంగా జలుబు, దగ్గు మాత్రమే కాదు ఎన్నో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?