సాధారణంగా కొందరు హైట్ తక్కువగా ఉన్నా మని తెగ బాధ పడుతుంటారు.ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది.
దీనినే షార్ట్ సాచ్యుర్ అని అంటారు.పౌష్టికాహారలోపం.
పుట్టుకతో సంభవించే వ్యాధులు, హార్మోన్ల లోపం, తల్లిదండ్రుల జీన్స్ ఇలా రకరకాల కారణాల వల్ల ఎత్తు పెరగరు.
దాంతో తెగ మదన పడుతూ ఉంటారు.ఎత్తు పెరగడానికి మందులు కూడా వాడతారు.
అయితే కొన్ని కొన్ని ఆహార పదార్థాలు హైట్ పెరగడానికి అద్భుతంగా దోహద పడతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి ఆ సూపర్ ఫుడ్స్ ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
హైట్ పెరిగేలా చేయడంలో బీన్స్ ఎంతగానో సహాయపడతాయి.బీన్స్‌లో శరీరం ఎదుగుదలకు అవసమయ్యే ప్రోటీన్లతో పాటుగా మరిన్ని పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
అందువల్ల, బీన్స్‌ను డైట్‌లో చేర్చుకుంటే చక్కగా ఎత్తు పెరుగుతారు.సోయా బీన్స్, సోయా మిల్క్ వంటివి తీసుకోవాలి.
ఎందుకంటే, సోయా ప్రోడెక్ట్స్‌లో ఉండే విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, ఫోలేట్, కార్బోహైడ్రేట్స్ ఎముకలు, కండరాల ఎదుగుదలను ప్రోత్సాహిస్తాయి.
దాంతో హైట్ పెరుగుతారు. """/"/
ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే ఆకుకూరలు.
ఎత్తు పెరగడానికి కూడా సహాయపడతాయి.ముఖ్యంగా పాలకూర, మెంతికూర, గోంగూర, తోటకూర, బ్రొకోలీ వంటివి తీసుకుంటే.
హైట్ పెరగడానికి అవసరం అయ్యే విటమిన్స్ మరియు న్యూట్రీషియన్స్ అందుతాయి.సహజంగా హైట్ పెరగాలంటే విటమిన్ డి కూడా ఎంతో అవసరం.