ఒత్తిడి.నేటి ఉరుకుల పరుగల జీవితంలో చాలా మంది ఫేస్ చేస్తున్న సమస్య ఇది.
బిజీ బిజీ లైఫ్ లో ఒత్తడికి గురికావడం కామన్.అయితే దీన్ని చాలా మంది చిన్న సమస్యగా భావిస్తుంటారు.
కానీ, ఒక్కోసారి ఈ ఒత్తిడే మనిషి పాలిట శాపంగా మారి.ప్రాణాలను హరించేస్తుంది.
ఇక ఈ ఒత్తిడి వల్లే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి.తలనొప్పి, స్థూలకాయం, మధుమేహం, హార్ట్ ఎటాక్ ఇలా ఒత్తిడి వల్ల ఎన్నో ప్రాణాంతక సమస్యలు వస్తుంటాయి.
అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు.దాన్ని జయించడం చాలా అవసరం.
అయితే కొన్ని ఆహార పదార్థాలు ఒత్తిడిని జయించడానికి అద్భుతంగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.కమలాపండు.
ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.కమలాపండు తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ సి.
ఒత్తిడిని ప్రభావితం చేసే హార్మోన్లను తగ్గించి మైండ్ రిలాక్స్ అయ్యేలా చేస్తుంది.అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు వంటి నట్స్ తీసుకోవడం వల్ల.
వాటిలో ఉండే ఖనిజ, లవణాలు ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
గోధుమలో తయారు చేసిన ఆహారం తీసుకుంటే.స్ట్రెస్ నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది.
ఎందుకంటే, ఐరన్ పుష్కలంగా ఉండే గోధుమలు.మెదడుకు ఆక్సిజన్‌ను ఇచ్చి ఒత్తిడిని నివారిస్తుంది.
"""/" /
అదేవిధంగా, రోజుకు ఒక అవకాడోను తీసుకోవాలి.ఎందుకంటే, అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు విటమిన్ బి, విటమిన్ ఎ.
మానసిక ఒత్తిడిని మరియు టెన్షన్స్ నుంచి బయటపడేలా చేస్తాయి.ఇక ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని అందించడంలో.
డార్క్ చాక్లెట్స్ కూడా గ్రేట్‌గా సహాయపడతాయి.కాబట్టి, మరీ ఎక్కువగా కాకుండా.
ప్రతి రోజు లిమిట్‌గా డార్క్ చాక్లెట్ తీసుకోవడం మంచిది.అలాగే వీటితో పాటు అరటి పండు, బొప్పాయి, బ్లూబెర్రీస్, గ్రీన్ టీ, చేపలు, పాలు, చిలగడ దుంపలు వంటివి కూడా డైట్‌లో చేర్చుకోవాలి.
ఎందుకంటే, ఇవి కూడా ఒత్తిడి నుంచి రిలీఫ్‌ను ఇస్తాయి.
భారతదేశంలో కూడా భూకంపం రాబోతోందా? అసలేం జరుగుతోంది?