శ‌రీరంలో వేడి త‌గ్గాలా.. అయితే ఇవి తీసుకోవాల్సిందే?

ఒంట్లో వేడి ఎక్కువైపోయింది బాబోయ్‌ అని ఎవ‌రో ఒక‌రు త‌ర‌చూ అంటుంటే మ‌నం వింటూనే ఉంటాం.

ఒంట్లో వేడి చేయ‌డం అనేది చాలా మందిలో క‌నిపించే కామ‌న్ స‌మ‌స్య‌.దీని వ‌ల్ల అనేక స‌మ‌స్య‌ల‌ను కూడా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది.

ముఖ్యంగా మలబద్ధకం, తల నొప్పి, మూత్రం లో మంట, ముక్కులో నుంచి ర‌క్తం రావ‌డం, వికారంగా ఉండ‌టం ఇలా ఎన్నో స‌మ‌స్య‌లు ఇబ్బంది పెడ‌తాయి.

అందుకే ఒంట్లో వేడిని త‌గ్గించుకునేందుకు ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయేవి డైట్‌లో చేర్చుకోవడం వల్ల సులువుగా శ‌రీరంలో వేడిని త‌గ్గించుకోవ‌చ్చు.

బాడీ హీట్ తగ్గించడంలో పుచ్చకాయ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.పుచ్చ‌కాయ‌లో అధికంగా ఉండే నీరు మిమ్మల్ని చల్లగా మరియు హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

కేవ‌లం పుచ్చ‌కాయ మాత్ర‌మే కాదు నీటి శాతం అధికంగా ఉండే కర్భూజా, ద్రాక్ష, కీరదోసకాయ వంటివి తీసుకున్నా ఒంట్లో వేడి త‌గ్గుముఖం ప‌డుతుంది.

"""/" / అలాగే శ‌రీరంలో అధిక వేడిని నివారించ‌డంలో మెంతులు కూడా గ్రేట్‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

మెంతుల‌ను పొడి చేసి గోరు వెచ్చ‌ని నీటిలో క‌లిపి సేవిస్తే బాడీలో ఉండే ఓవ‌ర్ హీట్ నార్మ‌ల్ అవుతుంది.

గ్లాస్ మ‌జ్జిగ‌లో ఉప్పు మ‌రియు నిమ్మ ర‌సం యాడ్ చేసి త‌ర‌చూ తాగుతున్నా కూడా ఒంట్లో వేడి త‌గ్గుముఖం ప‌డుతుంది.

మ‌రియు వాట‌ర్‌, కొబ్బ‌రి నీరు వంటివి కూడా త‌ర‌చూ తీసుకుంటూ ఉండాలి. """/" / అదేవిధంగా, ఒంట్లో వేడి స‌మ‌స్య అధికంగా ఉన్న ‌వాళ్లు చల్లని పాలలో తేనె కలుపుకుని తాగినా మంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఇక గసగసాలు కూడా బాడీ హీట్‌ను నివారించి శ‌రీరాన్ని చ‌ల్ల‌బ‌ర‌చ‌డంలో సూప‌ర్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.

కొన్ని గసగసాల‌ను నీరుతో పాటు తీసుకుంటే శ‌రీరం చ‌ల్ల బ‌డుతుంది.అయితే గ‌స‌గ‌సాల‌ను అధికంగా మాత్రం తీసుకో రాదు.

ఆర్టీసీ కార్గో పార్శిల్ మిస్సింగ్.. టెన్షన్ పడుతున్న అధికారులు.. ఎందుకంటే?