బట్టతల రాకూడదంటే ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే?!

బట్టతల రాకూడదంటే ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే?!

పురుషుల్లో అత్య‌ధికంగా క‌నిపిస్తున్న స‌మ‌స్య బ‌ట్ట‌త‌ల‌.యాబై, అర‌వై ఏళ్ల త‌ర్వాత బ‌ట్ట త‌ల వ‌చ్చినా ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోరు.

బట్టతల రాకూడదంటే ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే?!

కానీ, నేటి టెక్నాల‌జీ కాలంలో పాతిక‌, ముప్పై ఏళ్ల వారు సైతం ఈ స‌మ‌స్యతో బాధ ప‌డుతున్నారు.

బట్టతల రాకూడదంటే ఖ‌చ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే?!

ఆహార‌పు అల‌వాట్లు, మారిన జీవ‌న శైలి, పోష‌కాల లోపం, ఒత్తిడి, గంట‌లు త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ల ముందు ప‌ని చేయ‌డం, తలలో ఇన్ఫెక్షన్స్, మ‌ద్యపానం, ధూమ‌పానం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌ట్ట‌త‌ల ఏర్ప‌డుతుంది.

దాంతో ఈ స‌మ‌స్య‌ను నివారించుకునేందుకు నానా పాట్లు ప‌డ‌తుంటారు.కొంద‌రైతే ట్రీట్మెంట్లు చేయించుకోవ‌డం, మందులు వాడటం కూడా చేస్తుంటారు.

అందుకే బ‌ట్ట‌త‌ల వ‌చ్చాక తిప్ప‌లు ప‌డ‌టం కంటే.రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డమే మేలంటున్నారు.

మ‌రి బ‌ట్ట‌త‌ల రాకుండా ఏం చేయాలీ.? అనేగా మీ డౌట్‌.

మీరు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన ప‌నేమీ లేదండోయ్‌.కొన్ని కొన్ని ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే స‌రిపోతుంది.

మ‌రి ఆ ఆహారాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.వాల్ న‌ట్స్‌.

ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న‌ సంగ‌తి తెలిసిందే.అలాగే కేశ సంర‌క్ష‌ణ‌లోనూ ఇవి ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

వాల్ న‌ట్స్‌లో జుట్టు ఆరోగ్యానికి యూజ్ అయ్యే ప్రోటీన్స్‌, మిన‌ర‌ల్స్‌, విట‌మిన్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు నిండి ఉంటాయి.

అందువ‌ల్ల వీటిని రెగ్యుల‌ర్‌ డైట్‌లో చేర్చుకుంటే.జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

దాంతో బ‌ట్ట‌త‌ల వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది. """/"/ స్ట్రాబెర్రీలు తీసుకోవ‌డం వ‌ల్ల కూడా బ‌ట్ట‌త‌ల‌కు దూరంగా ఉండొచ్చు.

స్ట్రాబెర్రీ పండ్ల‌లో ఉండే కొన్ని ముఖ్య‌మైన పోష‌కాలు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.స్ట్రాబెర్రీలే కాకుండా.

పీచ్, జామ‌, బొప్పాయి, కివి వంటి పండ్ల‌ను కూడా తీసుకుంటే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది.

"""/"/ హెల్తీగా, ఫిట్‌గా ఉండాల‌ని చాలా మంది త‌మ డైట్‌లో ఓట్స్ చేర్చుకుంటారు.

అయితే బ‌ట‌త‌ల స‌మ‌స్య రాకుండా ర‌క్షించ‌డ‌లోనూ ఓట్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.ఓట్స్‌ను ఆహారంలో భాగంగా చేర్చుకుంటే.

బ‌ట్ట‌త‌ల‌ నుండి మిమ్మల్ని రక్షించడానికి అవసరమైన పోషకాహారాన్ని మీ జుట్టుకు అందుతాయి.ఇక వీటితో పాలు, పాల ఉత్ప‌త్తులు, గుడ్డు, చేప‌లు, మొల‌క‌లు, బాదం, ఆకుకూర‌లు వంటివి తీసుకోవ‌డం ద్వారా కూడా బ‌ట్ట‌త‌ల‌స‌మ‌స్య‌కు దూరంగా ఉండొచ్చు.