ఈ 5 ఆహారాలు మీ డైట్‌లో ఉంటే.. నలబైలోనూ యవ్వంగా మెరిసిపోతారు!
TeluguStop.com
వయసు పెరిగే కొద్ది యవ్వనం ఆవిరి అయిపోతుంటుంది.అందులోనూ నేటి రోజుల్లో నలబై ఏళ్లు వచ్చే సరికే కోట్లాది మంది వృద్ధాప్య లక్షణాలతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.
ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు, పోషకాల కొరత, కాలుష్యం, స్కిన్ కేర్ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే మేకప్ ప్రోడెక్ట్స్‌ను అధికంగా వినియోగించడం వంటి కారణాల వల్ల కాస్త ముందుగానే వ్యద్ధాప్య లక్షణాలు ఇబ్బంది పెడుతుంటాయి.
దాంతో వాటిని నివారించుకోవడం కోసం ఏవేవో ప్రయోగాలు చేస్తుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఐదు ఆహారాలను డైట్‌లో చేర్చుకుంటే నలబైలోనూ యవ్వంగా మెరిసిపోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండీ.పెరుగు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ పెరుగు సహాయపడుతుంది.
రోజుకు ఒక కప్పు పెరుగును తీసుకుంటే గనుక.అందులో ఉండే పోషకాలు ఏజింగ్ ప్రాసెస్‌ను అలస్యం అయ్యేలా చేస్తాయి.
వయసు పెరిగినా యవ్వనంగానే కనిపించాలంటే.తులసి టీని రెగ్యులర్‌గా తీసుకోవాలి.
తులసి టీలో ఉండే కొన్ని ప్రత్యేక సుగుణాలు సౌందర్యాన్ని పెంపొందించి ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తాయి.
నలబైలోనూ అందంగా, యవ్వనంగా మెరిసిపోవాలంటే ఖచ్చితంగా ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి.ప్రతి రోజు ఏదో ఒక ఆకుకూరను తీసుకుంటే ఆరోగ్యానికి ఉపయోగపడే బోలెడన్ని పోషకాలు సైతం అందుతాయి.
సంపూర్ణ పోషకాహారం అయిన గుడ్డు ఏ వయసు వారికైనా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
అలాగే అందాన్ని పెంచుతుంది.అవును, రోజుకు ఒక గుడ్డును తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.
"""/" /
చర్మ సౌందర్యం కోసం తప్పని సరిగా తీసుకోవాల్సిన ఆహారాల్లో చియా విత్తనాలు ఒకటి.
వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే గనుక.వయసు పెరిగినా చర్మం మాత్రం కాంతివంతంగానే మెరుస్తుంది.
మరియు ఆరోగ్యం కూడా పెరుగుతుంది.
వైరల్ వీడియో: కొత్త అల్లుడికి 465 రకాల వంటకాలతో విందు ఏర్పాటు