రోజంతా యాక్టివ్‌గా ఉండాలా? అయితే డైట్‌లో వీటిని చేర్చాల్సిందే!
TeluguStop.com
రోజంతా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉండాలని అందరూ కోరుకుంటారు.కానీ, ఎంత ఆహారం తీసుకున్నా.
కొందరు యాక్టివ్‌గా మాత్రం ఉండలేరు.పోషకాల లోపం, పలు అనారోగ్య సమస్యలు, ఆహారపు అలవాట్లు, నిద్రను నిర్లక్ష్యం చేయడం ఇలా రకరకాల కారణాల వల్ల నీరసంగా, నిరుత్సాహంగా కనిపిస్తారు.
ఈ స్థితిలో మీరూ ఉంటే ఖచ్చితంగా కొన్ని కొన్ని ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.
మరి ఆ ఆహారాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేయడంలో నట్స్ అద్భుతంగా సహాయపడతాయి.
ముఖ్యంగా బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, వాల్ నట్స్ వంటి వాటిని డైట్‌లో చేర్చుకుంటే.
ఎన్నో పోషకాలు వీటి ద్వారా అందుతాయి.మరియు శరీరానికి కావాల్సిన ఎనర్జీని కూడా లభిస్తుంది.
దాంతో మీరు రోజంతా సూపర్ యాక్టివ్‌గా ఉంటారు.అలాగే పిల్లలైనా, పెద్దలైనా తమ డైలీ డైట్‌లో ఒక కప్పు పెరుగు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే పెరుగును తీసుకుంటే.ఎటువంటి నీరసం, అలసట లేకుండా రోజంతా ఉత్సాహంగా పనులు చేసుకోగలుగుతారు.
మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్‌లో తప్పకుండా ప్రోటీన్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి.అంటే గుడ్డు, పాటు, ఓట్‌మీల్, క్యారెట్స్, తాజా ఆకుకూరలు వంటివి తీసుకుంటే.
శరీరానికి బోలెడంత శక్తి అందుతుంది. """/" /
మొలకలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని, బరువు తగ్గిస్తాయని అందరికీ తెలుసు.
అయితే రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు కూడా మొలకలు గ్రేట్‌గా సహాయపడతాయి.అందు వల్ల, తప్పకుండా మొలకలను మీ డైట్‌లో చేర్చుకోండి.
ఇక వీటిలో పాటు అరటి పండ్లు, కివి పండ్లు, అవకాడో, నానబెట్టిన చిక్కుళ్లు, సోయా, డైరీ ప్రొడక్ట్స్, కూరగాయలు, చికెన్ వంటి వాటిని కూడా తీసుకుంటూ ఉండాలి.
తద్వారా శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి.దాంతో రోజంతా మీరు చురుగ్గా ఉంటారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. ప్రముఖ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!