బాగా నీరసంగా ఉన్నప్పుడు ఈ ఆహారాలు తీసుకుంటే క్షణాల్లో సూపర్ ఎనర్జిటిక్ గా మారతారు!
TeluguStop.com
నీరసం.తరచూ వేధించే సమస్యల్లో ఇది ఒకటి.
నీరసం అనేది చిన్న సమస్య అయినప్పటికీ దాని కారణంగా ఎంతో అసౌకర్యానికి గురవుతుంటారు.
నీరసం వల్ల పనిపై ఏకాగ్రత లోపిస్తుంది.అడుగు తీసి అడుగు వేయడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది.
అయితే అలాంటి సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఆహారాలు తీసుకుంటే క్షణాల్లో సూపర్ ఎనర్జిటిక్ గా మారతారు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఇన్‌స్టంట్ ఎనర్జీని అందించే ఆ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం పదండి.
అరటిపండు.ధర తక్కువ అయినా పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
నీరసంగా ఉన్నప్పుడు ఒక్క అరటి పండు( Banana ) తీసుకుంటే చాలు క్షణాల్లో మీ శరీరం శక్తివంతంగా మారుతుంది.
తక్షణ శక్తిని అందించడానికి అరటిపండు చాలా అద్భుతంగా సహాయపడుతుంది.అలాగే ఇన్‌స్టంట్ ఎనర్జీని అందించే ఆహారాల్లో పెరుగు ఒకటి.
పెరుగు( Curd ) వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.నీరసాన్ని తరిమి కొట్టడానికి కూడా పెరుగు హెల్ప్ చేస్తుంది.
నీరసంగా ఉన్నప్పుడు ఒక్క కప్పు పెరుగు తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. """/" /
అలాగే చియా సీడ్స్ కూడా ఎనర్జీ బూస్టర్ గా పని చేస్తాయి.
ఒక్క గ్లాస్ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనే( Honey ) కలుపుకుని తీసుకోవాలి.
ఇలా చేస్తే నీరసం దెబ్బకు పరార్ అవుతుంది.ఒక్కోసారి నీరసం వల్ల తీవ్రమైన తలనొప్పి వచ్చేస్తుంటుంది.
అలాంటప్పుడు డార్క్ చాక్లెట్ ను తీసుకోవాలి. """/" /
డార్క్ చాక్లెట్ లో ఉండే పలు సుగుణాలు తలనొప్పితో పాటు నీరసాన్ని సైతం దూరం చేస్తాయి.
బాడీని ఫుల్ ఎనర్జిటిక్ గా మారుస్తాయి.ఇక ఒక గ్లాస్ కొబ్బరి పాలల్లో నాలుగు గింజ తొలగించిన ఖర్జూరాలు, రెండు టేబుల్ స్పూన్లు డ్రై రోస్ట్ ఓట్స్ మరియు వన్ టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తే మంచి స్మూతీ సిద్దమవుతుంది, ఈ స్మూతీ ని తీసుకున్న సరే నీరసం నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందొచ్చు.
మధుమేహం ఉన్నవారు నెయ్యి తినవచ్చా..?