మంచి నిద్ర కోసం ఈ ఆహార పదార్థాలు...

ప్రస్తుత సమాజంలో చాలామందికి పని ఒత్తిడి కారణంగా రాత్రి నిద్ర రాకపోవడం జరుగుతోంది.

మానవ జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైనది.మనిషి ప్రతిరోజు ఖచ్చితంగా 7 నుండి 8 గంటల వరకు నిద్రపోతే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మనం చేసే పనులతోపాటు తీసుకునే ఆహారం కూడా మన నిద్రపై ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతిరోజు ఆహారంలో ఈ పదార్థాలు ఉంటే మంచి నిద్ర వచ్చే అవకాశం ఉంది.

సాల్మన్‌ చేపలు తీసుకోవడం వల్ల మంచి నిద్రకు వీలు కలుగుతుందని నిపుణులు చెప్పారు.

ఈ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్‌ డి ఎక్కువగా ఉంటాయి.అవి శరీరంలో సెరొటోనిన్‌ హార్మోన్‌ ఉత్పత్తి చేస్తాయి.

ఈ హార్మోన్‌ శరీరంలో ఉత్పత్తి కావడం వల్ల మానసిక ఆరోగ్యం బాగుంటుంది.చెర్రీలు మన శరీరంలో మెలాటోనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తాయి.

రాత్రి పూట భోజనం తర్వాత చెర్రీ పండ్లను తీసుకుంటే మెలాటోనిన్ హార్మోన్ ఉత్పత్తి పెరిగి మంచి నిద్ర వస్తుంది.

ఈ పండ్లను డైరెక్ట్ గా తినలేకపోతే జ్యూస్ చేసుకుని కూడా త్రాగవచ్చు. """/"/ వాల్ నట్స్ లో ఒమేగా 3 సాటి ఫ్యాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి.

వాల్ నట్స్ ప్రతిరోజు మన ఆహారంలో భాగం చేసుకుంటే సరైన నిద్ర వస్తుంది.

ఓట్స్‌లో ట్రిప్టోఫాన్‌ అనే అమైనో యాసిడ్‌ ఎక్కువగా ఉంటుంది.ఇది మన శరీరంలో మెలటోనిన్‌, సెరటోనిన్‌ హార్మోన్లు తగిన స్థాయిలో ఉత్పత్తి అయ్యేందుకు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి మంచి నిద్రకు కారణమవుతాయని తెలిపారు. """/"/ రాత్రి సమయంలో సరైన నిద్ర రావాలంటే కొవ్వు, ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని అసలు తీసుకోకూడదు.

ఇవే కాకుండా పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్, మాంసాహారం కేకులు వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఆల్కహాల్ తీసుకునేవారు అప్పటికప్పుడు నిద్రలోకి జారిపోయిన ఆ నిద్ర నాణ్యత తక్కువగా ఉండడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండదని కూడా ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డీప్ సీక్ తో ప్రపంచాన్ని తన వైపుకు తిప్పేసుకున్న చైనా!