మద్యం తాగినా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తీసుకోవాల్సిందే!
TeluguStop.com
మద్యం ఆరోగ్యానికి హానికారం.ఈ విషయం అందరికీ తెలుసు.
కానీ, మద్యం సేవించడం మాత్రం ఎవ్వరూ మానరు.కొందరు అలవాటుగా తాగితే.
కొందరు ఫ్యాషన్‌గా తాగుతుంటారు.ఎలా తాగినా.
పోయేది ఆరోగ్యమే.అందులో అతిగా మద్యం తాగడం వల్ల ముందు లివర్ చెడిపోతుంది.
ఆ తర్వాత గుండె జబ్బులు, అధిక బరువు, జీర్ణశక్తి మందగించడం, నిద్రలేమి, మానసిక ఒత్తడి, అధిక రక్తపోటు, సంతానలేమి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనారోగ్య సమస్యలే తలెత్తుతాయి.
అలా అని ఆకస్మికంగా మద్యం మానేస్తే.వారిలో తాగాలనే కోరిక తీవ్రంగా పెరిగిపోతుంది.
దాంతో మరిన్ని సమస్యలు ఎక్కువవుతాయి.అందుకే మితంగా రోజుకు ఓ పెగ్ మద్యం పుచ్చుకుంటూ.
డైట్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.మరి మద్యం తాగినా ఆరోగ్యంగా ఉండాలంటే.
ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇప్పుడు ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం.మద్యం సేవించేవారు ఖచ్చితంగా గ్రీన్ టీను డైలీ తీసుకోవాలి.
ఎందుకంటే, మందు బాబులు గ్రీన్ టీ తీసుకుంటే అందులో ఉండే తన్నిన్స్, కటేచిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు లివర్, గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
మద్యం సేవించే వాళ్లకు ఎప్పుడూ జీర్ణాశయంలో మంట పుడుతుంటుంది.అయితే గ్రీన్ టీ తాగితే ఆ సమస్య ఉండదు.
అలాగే బీట్‌రూట్, క్యారెట్ దుంపులో తీసుకోవాలి.తద్వారా వీటిలో ఉండే మినరల్స్, విటమిన్లు, డైటరీ ఫైబర్ లివర్‌లో ఉండే కొవ్వును కరిగించి.
దాని పని తీరు మెరుగు పరుస్తాయి.అలాగే మద్యం సేవించే వారు ఏవేవో నూనెలతో చేసిన వంటలు కాకుండా.
ఆలివ్ ఆయిల్‌తో చేసిన వంటలు తీసుకుంటే మంచింది.ఇక మద్యం సేవించేవారు ఆరోగ్యంగా ఉండాలంటే తోటకూర, పాలకూర, మెంతికూర, బ్రోకలీ వంటి ఆకుకూరలు తీసుకోవాలి.
అలాగే సిట్రస్ జాతి పండ్లు అంటే కమలా, నిమ్మ, దానిమ్మ, బొప్పాయి, ద్రాక్ష వంటివి డైట్‌లో చేర్చుకుంటే.
లివర్‌కు జరిగే ఆక్సిడేటివ్ డ్యామేజ్‌ను నివారిస్తాయి.అదేవిధంగా, వెల్లుల్లి, అల్లం ప్రతి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.
లివర్‌లో పేరుకుపోయిన వ్యర్ధ పదార్ధాలను నాశనం చేయడంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి.
అయితే పైన చెప్పుకున్న వాటిని ఆహారంగా తీసుకుంటూ ఆరోగ్యానికి ఏం పర్వాలేదనుకుని ఫుల్‌గా తాగేస్తే పోతారు జాగ్రత్త.
ఎందుకంటే, మద్యం ఆరోగ్యానికి హానికరం.కానీ, పూర్తిగా మానలేము అనుకునేవారు రోజుకు ఒక పెగ్ తీసుకుంటూ.
పైన చెప్పిన ఆహారం డైట్‌లో చేర్చుకుంటే కొంతలో కొంతైనా ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు.
బస్సులో నిద్రిస్తున్న మహిళను వేధించిన కండక్టర్.. వీడు కండక్టర్ కాదు, కామాంధుడు.. వీడియో వైరల్