బాలింతలు అస్సలు తినకూడని ఆహారాలు ఇవే!
TeluguStop.com
ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి విషయంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటారో.డెలివరీ తర్వాత కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా ఆహార విషయంలో బాలింతలు చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది.బాలింతలు త్వరగా జీర్ణమయ్యేవి మరియు అన్ని పోషకాలు కలిగి ఉండే ఆహారాలు తీసుకోవాలి.
అప్పుడే బిడ్డలకు తల్లి పాల ద్వారా తగినన్ని న్యూట్రీషియన్స్ అంది ఆరోగ్యంగా ఉంటారు.
అయితే కొన్ని కొన్ని ఆహారాలకు దూరంగా కూడా ఉండాలి.మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీని తీసుకోరాదని అందరికీ తెలుసు.అయితే బాలింతలు కూడా కాఫీని తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకంటే, కాఫీలో అధిక మోతాదులో కెఫిన్ ఉంటుంది.ఇది తల్లిపాల ద్వారా శిశువు వెళ్లి.
వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.ముఖ్యంగా శిశువు నిద్రను పాడుచేస్తుంది.
కాఫీనే కాదు.కెఫిన్ ఉండే చాక్లెట్లు, కూల్ డ్రింక్స్ వంటి వాటికి కూడా దూరంగా ఉండాలి.
"""/" /
అలాగే పాలిచ్చే సమయంలో బాలింతలు ఎట్టి పరిస్థితుల్లోనూ మసాలా మరియు స్పైసీ ఫుడ్ తీసుకోరాదు.
వీటిలో వల్ల తల్లికి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడతాయి.నిమ్మ ఆరోగ్యానికి మంచిదే.
అయినప్పటికీ బాలింతలు మాత్రం తీసుకోరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.ఎందుకంటే, నిమ్మలో ఉండే కొన్ని కాంపౌండ్స్.
శిశువులో ఇరిటేషన్ ను పుట్టిస్తుంది.దాంతో వారు ఎప్పుడు మూడీగా కనిపిస్తుంటారు.
అదేవిధంగా, మద్యం అలవాటు ఉన్న మహిళలు.పిల్లలకు పాలిచ్చే సమయంలో అస్సలు తీసుకోరాదు.
ఎందుకంటే, మద్యం పాల ద్వారా శిశువుకు చేరి.వారి ఎదుగుదలపై దెబ్బ కొడుతుంది.
ఇక బాలింతలు గ్రీన్ వెజిటేబుల్ బ్రొకోలీకి దూరంగా ఉండటమే మంచిది.దీని వల్ల బాలింతలకు కడుపు నొప్పి మరియు గ్యాస్ వంటి సమస్యలకు ప్రేరేపిస్తుంది.
అలాగే బాలింతలు వేరుశనగలు కూడా తీసుకోరాదు.వీటి వల్ల తల్లితో పాటు శిశువుకు కూడా అలర్జీ సమస్య ఏర్పడుతుంది.
చంద్రబాబు హామీ : వంగవీటి రాధా దశ తిరగబోతోందా ?