ఈ ఫుడ్స్ క‌లిపి తింటే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గొచ్చ‌ట‌!

ఇటీవ‌ల కాలంలో వ‌య‌సుతో సంబంధం లేకుండా ఎంద‌రినో ప్ర‌ధానంగా వేధిస్తున్న స‌మ‌స్య అధిక బ‌రువు.

జీవ‌నశైలిలో మార్పులు, ఆహార‌పు అల‌వాట్లు, మ‌ద్య‌పానం, పోష‌కాల లోపం, ధీర్ఘ‌కాలిక వ్యాధులు, ఒత్తిడి ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల బ‌రువు పెరుగుతాయి.

కార‌ణాలు ఏమైన‌ప్ప‌టికీ.అధిక బ‌రువును అదుపులోకి తెచ్చుకోకుంటే మాత్రం అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టేస్తాయి.

అందుకే పెరిగిన బ‌రువును క‌రిగించుకునేందుకు ఎన్నెన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. """/" / అయితే కొన్ని కొన్ని ఆహారాల‌ను క‌లిపి తీసుకుంటే సూప‌ర్ ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గొచ్చ‌ని అంటున్నారు నిపుణులు.

మ‌రి బ‌రువు త‌గ్గించే ఆ ఫుడ్ కాంబినేష‌న్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.పైనాపిల్, నిమ్మరసం.

ఈ రెండిటినీ క‌లిపి తీసుకుంటే త్వ‌ర‌గా వెయిట్ లాస్ అవ్వొచ్చు.నిమ్మ‌ర‌సానికి కొవ్వును క‌రిగించే గుణం ఉంటే.

పైనాపిల్‌లో కేల‌రీలు త‌క్కువ‌గా, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉంటుంది.అందువ‌ల్ల‌, ఈరెండింటినీ క‌లిపి తీసుకుంటే ఒంట్లో పేరుకుపోయిన అద‌న‌పు కొవ్వు గ‌మ్మున క‌రుగుతుంది.

అలాగే గుడ్డు, మిరియాలు క‌లిపి తీసుకోవ‌డం ద్వారా కూడా వేగంగా బ‌రువు త‌గ్గొచ్చ‌ట‌.

పోష‌కాల‌కు నిల‌య‌మైన గుడ్డుకు కాస్త మిరియాల పొడిని చేర్చి తీసుకుంటే త్వ‌ర‌గా వెయిట్ లాస్ అవుతారు.

అంతే కాదు.గ్యాస్‌, ఎసిడిటీ, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి స‌మ‌స్య‌లు దూరమై జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.

"""/" / బ‌రువును వేగంగా త‌గ్గించ‌డంలో ఓట్మెల్‌, నట్స్ కాంబినేష‌న్ కూడా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

ఈ రెండింటినీ క‌లిపి తీసుకుంటే అతి ఆక‌లి త‌గ్గుతుంది.దాంతో చిరుతిండ్ల‌పై మ‌న‌సు మ‌ల్ల‌కుండా ఉంటుంది.

ఫ‌లితంగా బ‌రువు  త‌గ్గుతారు.పైగా ఓట్మెల్‌లో బాదం, వాల్ నట్, పిస్తా వంటి న‌ట్స్‌ను క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి బోలెడ‌న్ని పోష‌కాలు ల‌భిస్తాయి.

రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.మ‌రియు గుండె ఆరోగ్యం సైతం మెరుగుప‌డుతుంది.

హత్య కేసులో పరారీ .. కెనడా మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో భారత సంతతి వ్యక్తి