ఈ ఆర్థిక సమస్యలు ఎలాంటి కాపురంలోనైనా చిచ్చు పెట్టడం ఖాయం..!

ఆర్థిక సమస్యలు( Financial Problems ) వైవాహిక సమస్యలను కలిగిస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.

ఎలాంటి బంధాన్ని అయినా చిదిమేసే శక్తి ఒక్క డబ్బుకే ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

కుటుంబంలో ప్రేమ ఒక్కటే కాదు మంచి కుటుంబం ఉండాలంటే మనీ మేనేజ్‌మెంట్ కళ( Management ) కూడా తెలిసి ఉండాలి.

లేకపోతే భార్య, భర్తల మధ్య రోజు రోజుకు గొడవలు పెరిగిపోతాయి.ఈ చిన్న సమస్యలే చివరకు ప్రాణాలు తీసుకునే వరకు వెళ్తాయి.

అలా జరగకూడదు కుటుంబమంతా సంతోషంగా ఉండాలంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి.

అసలు అంతగా బంధాలను నాశనం చేసే సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ పోషణకు డబ్బు( Money ) ఎంతో ముఖ్యం.

ప్రతి కుటుంబంలో కొన్నిసార్లు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి.ఇలాంటి సమస్యల వల్ల కుటుంబంలో ఎన్నో రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి.

కానీ చిన్న చిన్న విషయాలకు కూడా డబ్బులు కట్టలేకపోవడంతో భార్యాభర్తల మధ్య మనస్పర్దాలు( Family Disputes ) వచ్చి ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి.

మరి ముఖ్యంగా ఇంటి మనిషి డబ్బు సంపాదించకపోతే కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించకపోతే కుటుంబంలో ఒక పెద్ద సమస్య వస్తుంది.

"""/" / ఇంకా చెప్పాలంటే కొంతమంది పెళ్లయ్యాక అప్పులు( Debts ) తీసుకుంటారు.

పెళ్లి అనే ఈ అప్పుల భారం వల్ల చిన్న కోరిక కూడా తీర్చుకోవడం కష్టమవుతుంది.

ఉదాహరణకు చిన్న బహుమతి ఇవ్వాలన్న, కలిసి విహారయాత్రలకు వెళ్లాలన్న అన్ని లెక్కలు వేసుకొని చేస్తూ ఉండవలసి వస్తుంది.

జీవితం ఇలాగే కొనసాగితే మీ భాగస్వామి( Life Partner ) మనస్సు చాలా నీరసంగా ఉంటుంది.

భాగస్వామి పై అసంతృప్తి ఉంటుంది.ఇవన్నీ కుటుంబంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి.

దంపతుల్లో ఒకరికి ఎక్కువ ఖర్చు పెట్టడం ఇష్టం ఉండదు.ఇంకొకరు ఆడంబరాలకు వెళ్లి అధిక ఖర్చు చేస్తుంటారు.

"""/" / ఈ కారణంగా ఇద్దరి మధ్య మనస్పర్దాలు వస్తాయి.ముఖ్యంగా చెప్పాలంటే మన భారతీయ సమాజంలో మగవారు పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవాలని అంటారు.

కానీ మనిషి కుటుంబ బాధ్యతలు ఏమి తీసుకోకుండా రౌడీలా ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు కచ్చితంగా వస్తాయి.

కాబట్టి ఈ సమస్యలు రాకుండా చూసుకుంటే మీతో పాటు మీ కుటుంబం కూడా చాలా సంతోషంగా ఉంటుంది.

మా చట్టాలను గౌరవిస్తే అమెరికా అవకాశాల గని.. లేదంటే : భారతీయ విద్యార్ధులకు వార్నింగ్