మీ లివ‌ర్ ఆరోగ్యంగా ఉండాలంటే.. ఖ‌చ్చితంగా ఇవి తినాల్సిందే!

మ‌న శ‌రీరంలో అత్యంత ముఖ్య‌మైన‌ అవ‌య‌వాల్లో లివ‌ర్ (కాలేయం) ఒక‌టి.అలాగే శ‌రీరంలో ఉన్న అన్ని అవ‌య‌వాల కంటే లివ‌రే పెద్ద‌ది కూడా.

శ‌రీరంలో చేరే విషాల్ని విరిచేసి ర‌క్తాన్ని శుద్ధి చేయ‌డంలోనూ, శ‌రీరానికి కావాల్సిన శ‌క్తి త‌యారు చేయ‌డంలోనూ, జీవక్రియలకు అవసరమైన హార్మోన్లను స్రవించ‌డంలోనూ లివ‌ర్ కీల‌క పాత్ర పోషిస్తుంది.

కానీ, కొన్ని అల‌వాట్ల వ‌ల్ల లివ‌ర్ దెబ్బ‌తింటుంది.లివ‌ర్ దెబ్బ తిన‌డం వ‌ల్ల ప్రాణాల‌కే ముప్పు వాటిల్లుతుంది.

అందుకే లివ‌ర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆహారాల‌ను డైట్‌లో చేర్చుకుంటే.

మీ లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగుపురుచుకోవ‌చ్చు.అవేంటో చూసేయండి.

కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో వెల్లుల్లి అద్బుత పాత్ర పోషిస్తుంది.రెగ్యుల‌ర్‌గా వెల్లుల్లి తీసుకోవ‌డం వ‌ల్ల.

అందులో ఉండే పోష‌కాలు లివ‌ర్‌ను శుభ్ర‌ప‌రిచి.దాని ప‌నితీరు మెరుగుప‌రుస్తుంది.

అలాగే ప‌సుపు ప్ర‌తి రోజు ఏదో ఒక రూపంలో తీసుకుంటే.శ‌రీరంలో కొవ్వు క‌ర‌గ‌డంతో పాటు కాలేయం కూడా ఆరోగ్యంగా మారుతుంది.

బీట్ రూట్, క్యారెట్‌ల‌ను త‌ర‌చూ తీసుకోవ‌డం వ‌ల్ల‌.అందులో ఉండే పోష‌కాలు లివ‌ర్‌లోని కణాలు పునరుత్పత్తిగికి అద్భుతంగా స‌హాప‌డ‌తాయి.

అలాగే ఆకుకూర‌లు ముఖ్యంగా బ్రోకలీ, కొత్తిమీర‌, తోట‌కూర‌ కాలీఫ్లవర్, క్యాబేజీ వంటివి డైట్‌లో చేర్చుకోవ‌డం వ‌ల్ల‌.

లివ‌ర్ ప‌ని తీరు స‌క్ర‌మంగా జ‌రుగుతుంది.ఇక దెబ్బ తిన్న లివ‌ర్‌ను ఆరోగ్యంగా మార్చ‌డంలో విట‌మిన్ సి కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది.

కాబ‌ట్టి, విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటే నిమ్మ‌, క‌మ‌లా పండు, బ‌త్తాయి, ద్రాక్షపండ్లు, బెర్రీస్‌తో పాటు యాపిల్‌, అవొకాడో కూడా త‌ర‌చూ తీసుకోవాలి.

అదేవిధంగా, కాలేయం ఆరోగ్యంగా ప‌ని చేయాలంటే రోజుకు క‌నీసం ఒక క‌ప్పుడు గ్రీన్ టీ తీసుకోవాలి.

ఎందుకంటే, గ్రీన్‌లో టీ ఉంటే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ లివ‌ర్ స‌మ‌స్య‌ల‌ను దూరం చేసి ఆరోగ్యంగా ఉండేలా స‌హాయ‌ప‌డుతుంది.

ఇక రెగ్యుల‌ర్‌గా న‌ట్స్‌ను కూడా తీసుకోవాలి.న‌ట్స్ ఉండే గుడ్ ఫ్యాట్స్ లివ‌ర్ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

ఆ విషయంలో కోలీవుడ్ స్టార్ హీరో, క్రికెటర్ ధోనినే బీట్ చేసిన సాయి పల్లవి… ఇదేం క్రేజ్ రా బాబు!