Knee Pains : ఈ డ్రింక్స్ మీ డైట్ లో ఉంటే కీళ్ల నొప్పులు బ‌లాదూర్ అవ్వాల్సిందే!

కీళ్ల నొప్పులు( Knee Pains ).వయసు పైబడిన వారిలో ప్రధానంగా తలెత్తే సమస్యల్లో ఒకటి.

అయితే ఇటీవల కాలంలో మధ్య వయసు ఉన్నవారు కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.

యూరిక్ యాసిడ్ స్థాయి పెరగడం, ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు తదితర కారణాల వల్ల కీళ్ల నొప్పులు బాధిస్తూ ఉంటాయి.

కీళ్ల నొప్పుల కారణంగా నడవాలన్నా, నిలబడాలన్నా, కనీసం కూర్చోవాలన్నా ఎంతో ఇబ్బందికరంగా ఉంటుంది.

అయితే కీళ్ల నొప్పుల నుంచి బయటపడడానికి కొన్ని కొన్ని ఆహారాలు చాలా బాగా సహాయపడతాయి.

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్స్ మీ డైట్( Diet ) లో కనుక ఉంటే కీళ్ల నొప్పులు బలాదూర్ అవ్వాల్సిందే.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. """/"/ ఆరెంజ్ జ్యూస్( Orange Juice ).

కీళ్ల నొప్పులను వదిలించడానికి అద్భుతంగా సహాయపడుతుంది.ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి రిచ్ గా ఉంటుంది.

అలాగే ఇతర విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి.అవి కీళ్ల నొప్పులు దూరం చేయడానికి తోడ్పడతాయి.

నిత్యము ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులకు గుడ్ బై చెప్పవచ్చు.

"""/"/ అలాగే అల్లం వెల్లుల్లి టీ( Ginger Garlic Tea ) కూడా కీళ్ల నొప్పుల బాధితులకు బెస్ట్ డ్రింక్ అని చెప్పుకోవచ్చు.

అందుకోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పూసుకోవాలి.

అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము, వన్ టేబుల్ స్పూన్ వెల్లుల్లి తురుము వేసుకుని ఎనిమిది నిమిషాల పాటు మరిగించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను ఫిల్టర్ చేసుకుంటే మన టీ సిద్ధం అవుతుంది.

ఈ టీ లో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.

ఇవి కీళ్ల నొప్పులను దూరం చేయడానికి తోడ్పడతాయి.పైగా అల్లం శరీరంలో అధికంగా ఉన్న యూరిక్‌ యాసిడ్ ను సైతం త‌గ్గిస్తుంది.

"""/"/ ఇక కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి గ్రీన్ టీ( Green Tea ) కూడా బెస్ట్ డ్రింక్ అవుతుంది.

సాధారణంగా గ్రీన్ టీ వెయిట్ లాస్ కు మాత్రమే సహాయపడుతుందని చాలామంది భావిస్తూ ఉంటారు.

కానీ నిజానికి ఆరోగ్యపరంగా గ్రీన్ టీ మరిన్ని ప్రయోజనాలను చేకూరుస్తుంది.గ్రీన్ టీ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ద్వారా కీళ్ల నొప్పులను సైతం దూరం చేసుకోవచ్చు.

రాజమౌళి ఈగ సినిమాలో ఈగ పాత్రకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?