వేసవిలో ఎండ తీవ్రత ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.భానుడు తన విశ్వరూపం చూపిస్తూ భగ భగ మంటూ అగ్నిగోళంలాగా మండుతూ, వేడి గాలులు వేద జల్లుతున్నాడు.
వేడిని తట్టుకోలేక అటు ప్రజలు, ఇటు మూగ జీవులు సైతం అల్లాడిపోతున్నాయి.ఎంత ఎండ ఉన్నా పనులు నిమిత్తం ఇంటి నుండి కాలు బయట పెట్టక తప్పడం లేదు.
మనుషులు దాహం వేస్తే చల్లటి నీళ్లు తాగుతున్నారు.కానీ మండుతున్న ఎండలకు జంతువులు, పక్షులు సైతం నీటి కోసం అల్లాడిపోతున్నాయి.
ఎక్కడ నీరు దొరికితే చాలు అక్కడ వాలిపోయి దాహన్ని తీర్చుకుంటున్నాయి.తాజాగా సోషల్ మీడియాలో ఎండ తాపాన్ని తట్టుకోలేక ఒక కుక్క చేసిన పనికి నెటిజన్లు నివ్వెరపోతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఎండ వేడిని తట్టుకోలేక ఒక కుక్క బకెట్లో నీళ్లు ఉంటే ఆ నీటిలో దిగి ఎంచక్కా జలకాలాడుతూ ఎంజాయ్ చేస్తుంది.
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక కుళాయిలో నుంచి ఒక జాడీలోకి నీళ్లు పడి ఆ జాడి నీరుతో నిండిపోయి ఉంది.నీరుతో నిండుగా ఉన్న ఆ జాడీని చూసిన ఓ కుక్క తన వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి ఆ జాడీలోకి వెళ్ళడానికి చూసింది.
కానీ కుక్క చేసిన ప్రయత్నం మొదట విజయవంతం అవ్వలేదు.అయినా ఆ కుక్క పట్టువదలని విక్రమార్కుడు లాగా ఎంతో శ్రమించి ఎట్టకేలకు పక్కనే ఉన్న బకెట్ పైకి ఎక్కి నీటిలోకి దిగింది.
హమ్మయ్య అనుకుని ఆ చల్లటి నీటిలోని చల్లదనాన్ని పూర్తిగా ఆస్వాదించింది.ఆ జాడిలోని నీరును స్విమ్మింగ్ ఫూల్ లాగా ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది.
నీటిలో పైకి, కిందకు మునుగుతూ తేలుతూ ఎంచక్కా ఆడుకుంది.ఈ వీడియోను నెటిజన్లు తెగ లైక్ చేస్తున్నారు.
కుక్క ఐడియా మాములుగా లేదుగా అంటూ ఒకరు కామెంట్ చేస్తే దేనితో అయినా పెట్టుకో సూర్యుడితో పెట్టుకుంటే మాడి మసి అయిపోతావ్ అంటూ మరొక నేటిజన్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ పూర్తిగా చదవండి ఎండ వేడికి మూగజీవులు అల్లాడిపోతున్నాయి కావున డాబా పైన గాని ఇంటి బయట గాని కొద్దిగా నీళ్లు ఏర్పాటు చేస్తే ముగ జీవులు ఆ నీటిని తాగి తమ దాహన్ని తీర్చుకుంటాయి అని కొందరు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
క్లిక్ పూర్తిగా చదవండి