Balakrishna Vs Junior NTR : బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్లు.. ఎన్టీఆర్ కు డిజాస్టర్లు.. ఈ దర్శకులు తారక్ కు భారీ షాకులిచ్చారుగా!
TeluguStop.com
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు( Nandamuri Heroes ) భారీ స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉంది.
రాయలసీమలో నందమూరి హీరోల సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లను సాధిస్తాయి.
అయితే కొంతమంది దర్శకులు మాత్రం బాలయ్యకు భారీ బ్లాక్ బస్టర్ హిట్లు ఇవ్వగా జూనియర్ ఎన్టీఆర్ కు మైండ్ బ్లాంక్ అయ్యే షాకులిచ్చారు.
బాబాయ్ కు భారీ హిట్లు ఇచ్చిన దర్శకులు అబ్బాయికి మాత్రం హిట్లు ఇవ్వలేకపోయారు.
"""/"/
బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్( Balakrishna B Gopal ) బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.
ఈ కాంబోలో లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, పలనాటి బ్రహ్మనాయుడు సినిమాలు తెరకెక్కగా పలనాటి బ్రహ్మనాయుడు సినిమా నిరాశపరిచినా ఈ కాంబినేషన్ కు ఏకంగా 80 శాతం సక్సెస్ రేట్ ఉంది.
బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ అంటే టాలీవుడ్ లో స్పెషల్ కాంబినేషన్ అని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.
బాలయ్యకు భారీ హిట్లు ఇచ్చిన ఈ దర్శకుడు జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) తో అల్లరి రాముడు, నరసింహుడు సినిమాలను తెరకెక్కించారు.
ఈ రెండు సినిమాలలో అల్లరి రాముడు యావరేజ్ మూవీగా నిలిస్తే నరసింహుడు డిజాస్టర్ అయింది.
ఈ విధంగా బాబాయ్ కు హిట్లు ఇచ్చిన దర్శకుడు అబ్బాయికి మాత్రం హిట్ ఇవ్వలేకపోయారు.
జూనియర్ ఎన్టీఆర్ బి.గోపాల్ కాంబో ప్రేక్షకులను మెప్పించలేదు.
"""/"/
బాలయ్య బోయపాటి శ్రీను( Boyapati Srinu ) కాంబో ఫ్యాన్స్ కు స్పెషల్ కాంబో కాగా ఈ కాంబోలో తెరకెక్కిన సింహా, లెజెండ్, అఖండ ఒక సినిమాను మించి మరొకటి హిట్ అయ్యాయి.
అయితే ఎన్టీఆర్ బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన దమ్ము మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ హిట్ కాలేదు.
ఈ విధంగా బాలయ్యకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను ఎన్టీఆర్ కు హిట్ ఇవ్వలేకపోయారు.
విచిత్రం ఏంటంటే వినాయక్, పూరీ జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ కు భారీ హిట్లు ఇవ్వగా ఈ దర్శకులు బాలయ్యకు భారీ హిట్ ఇవ్వలేకపోయారు.
వైరల్ వీడియో: ఏంటి బ్రో హీరోను పుసుక్కున అంత మాటనేశావ్..