ఈ టాలీవుడ్ సెలబ్రిటీస్ అంత కూడా నిజజీవితంలో వైద్యులు
TeluguStop.com
చాలా మంది డాక్టర్ కావాలి అనుకుని యాక్టర్ అయ్యాను అని సినీ జనాలు చెప్తుంటారు.
కానీ నిజ జీవితంలో డాకర్లు అయి యాక్టర్లుగా మారిన నటులు ఎంతో మంది ఉన్నారు.
రియల్ లైఫ్ లో జనాలకు ప్రాణం పోసే ఆ డాక్టర్లే.రీల్ లైఫ్ లో క్యారెక్టర్లకు ప్రాణం పోస్తున్నారు.
ఇంతకీ డాక్టర్టు అయిన యాక్టర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం!.అల్లు రామలింగయ్య : """/"/
ప్రముఖ హస్య నటుడు, మెగాస్టార్ మామ అల్లు రామలింగయ్యకు పెద్దగా చదువు వంటబట్టలేదు.
కుటుంబాన్ని పోషించేందుకు హోమియోపతి వైద్యం నేర్చుకున్నాడు.జనాలకు వైద్యం చేసేవాడు.
డాక్టర్ గా గుర్తింపు పొందాడు.ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చివెయ్యికిపైగా సినిమాల్లో నటించాడు.
ఆయన పేరుతో రాజమండ్రిలో ఓ కాలేజీ కూడా ఉంది.రాజశేఖర్:
ఈ పవర్‌ఫుల్ మీరో సినిమాల్లోకి రాకముందు ఎంబీబీఎస్ డాక్టర్.
వైద్య వృత్తి చేస్తూ డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు.సినిమాలపై ఇంట్రెస్ట్ తో వచ్చి మంచి సినిమాలు చేశాడు.
నటి జీవితను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.సౌందర్య:
సూత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన సౌందర్య కూడా మెడిసిన్ మధ్యలో ఆపేసింది.
సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ అయ్యింది.నటిగా మంచి స్వింగ్ లో ఉన్న సమయంలోనే విమాన ప్రమాదంలో ఆమె చనిపోయింది.
ప్రణీత : """/"/
బావ సినిమాతో హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రణీత కూడా డాక్టరే.
సినిమాల్లో బిజీ గా ఉంటూనే ఖాళీ టైంలో సొంత క్లినిక్ లో రోగులకు వైద్యం చేస్తుంది.
సాయి పల్లవి:
ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులుకు పరిచయం అయి తన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సాయి పల్లవి.
అంతకు ముందు ఢీ డాన్స్ షోలో మంచి డ్యాన్సర్ గా గుర్తింపు పొందింది.
ఆ తర్వాత హీరోయిన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.ఈమె కూడా సినిమాల్లోకి రాక ముందు మెడిసిన్ చదివింది.
జార్జియాలో తన విద్యను కొనసాగింది.భరత్ రెడ్డి: """/"/
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు భరత్‌రెడ్డి ప్రముఖ డాక్టర్.
నటుడు భరత్ రెడ్డి అపోలో హాస్పిటల్లో కార్డియాలజీ స్పెషలిస్ట్‌గా మంచి పేరు తెచ్చుకున్నాడు.
సినిమా రంగంపై ఇష్టంతో ఇండస్ట్రీలోకి వచ్చాడు.రంగం విలన్ అజ్మల్ అమీర్, వెటరన్ యాక్టర్ ప్రభాకర్ కూడా డాక్టర్లుగానే జీవితాన్ని ప్రారంభించియాక్టర్లుగా మారారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్ 4, బుధవారం 2024