అధిక ఆకలిని తగ్గించే మార్గాలు ఇవి..!
TeluguStop.com
అధిక ఆకలి అనేది వివిధ ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.అధిక ఆకలి వల్ల అధికంగా తింటారు.
ఇది శరీరంలో కొవ్వు నిల్వను పెంచి ఊబకాయానికి దారితీస్తుంది.అలాగే అధిక ఆకలి కారణంగా మధుమేహం, జీర్ణకోశ సమస్యలు, హృదయ రోగాలు, ఫ్యాటీ లివర్, మెటబాలిక్ సిండ్రోమ్, మానసిక రుగ్మతలు (Diabetes, Gastrointestinal Problems, Heart Disease, Fatty Liver, Metabolic Syndrome, Mental Disorders)తలెత్తే అవకాశాలు పెరుగుతాయి.
అందువల్ల అధిక ఆకలి సమస్యను దూరం చేసుకోవడం చాలా అవసరం.ఈ నేపథ్యంలోనే అధిక ఆకలిని తగ్గించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అధిక ఆకలిగి దూరంగా ఉండాలంటే తగినంత ప్రోటీన్ తీసుకోవడం ఎంతో ముఖ్యం.ప్రోటీన్ పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది.
అధిక ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
ఫైబర్ రిచ్ ఫుడ్స్(Fiber-rich Foods) మెల్లగా జీర్ణమవుతాయి.దీని వల్ల త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది.
జంక్ ఫుడ్ ను పూర్తిగా ఎవైడ్ చేయండి.ఆకలి పుట్టించే అల్కహాల్, సోడా లేదా శీతల పానీయాలు తీసుకోవడం మానుకోండి.
"""/" /
ఫోన్లు, టీవీలు చూస్తూ కాకుండా తినే ఆహారంపై దృష్టి పెట్టి తినండి.
ఆకలి ఉన్నప్పుడు చిప్స్, చాక్లెట్స్ (Chips, Chocolates)వంటివి కాకుండా పండ్లు, నట్స్ తీసుకోవడం మంచిది.
డీహైడ్రేషన్ వల్ల కూడా ఆకలి వేస్తుంటుంది.అందువల్ల నీటిని ఎక్కువగా త్రాగండి.
అధిక ఆకలి సమస్య తగ్గాలంటే వేళకు ఆహారం తీసుకోండి.ఒకేసారి ఎక్కువ తినడం కాకుండా, రోజులో 4-5 చిన్న అల్పాహారాలు తీసుకోవడం మంచిది.
"""/" /
జీలకర్ర నీరు అధిక ఆకలిని నివారించడంతో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఒక గ్లాస్ నీటిలో అర టీ స్పూన్ వేయించిన జీరకర్ర పొడి కలిసి ఉదయాన్నే తీసుకోండి.
ఇది జీర్ణప్రక్రియను మెరుగుపరచి ఆకలి నియంత్రిస్తుంది.జీలకర్రకు బదులుగా మెంతులు తీసుకున్నా మంచిదే.
వన్ టీ స్పూన్ మెంతులను నైట్ అంతా నీటిలో నానబెట్టి రోజూ ఉదయాన్నే తీసుకుంటే అతి ఆకలి పరార్ అవుతుంది.
కూరగాయల సూప్, బాదం, వేరుశనగలు, కీరా, క్యారెట్స్, సలాడ్స్, అల్లం టీ, అరటిపండ్లు వంటి ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.
ఇవి ఆకలిని నియంత్రించడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.
హాలీవుడ్ డైరెక్టర్ డైరెక్షన్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. బాక్సాఫీస్ షేక్ కానుందా?