ఏప్రిల్ నెలలో రిలీజ్ కానున్న టాప్ ఫోన్లు ఇవే.. ఓ లుక్కేయండి..

మార్చి నెలలో చాలా స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయి వినియోగదారులను ఆకట్టుకున్నాయి.ఏప్రిల్‌లో కూడా పలు రకాల ఫోన్లు రిలీజ్ కానున్నాయి.

ఈ నెలలోనే రియల్‌మీ కంపెనీ చైనాలో జీటీ నియో 5 ఎస్ఈ( Realme GT Neo 5 ) మొబైల్‌ని విడుదల చేస్తుంది.

ఇందులో 6.74-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెన్సార్లు, 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన పెద్ద 5500mAh బ్యాటరీ ఉన్నాయి.

"""/" / ఇక ఇండియన్ మార్కెట్‌లో రియల్‌మీ నార్జో N55 కూడా లాంచ్ కానుంది.

ఈ అప్‌కమింగ్ మొబైల్ గురించి ఇంకా వివరాలు ఏవీ బయటకి రాలేదు.పోకో F5 కూడా భారతదేశంలో ఈ నెలలో విడుదల కానుంది.

ఇది రెడ్‌మీ నోట్ 12 టర్బోకి రీబ్రాండెడ్( Redmi Note 12 Turbo ) వెర్షన్ అని ఒక పుకారు ఉంది.

ఇది 6.67-అంగుళాల QHD+ అమోలెడ్ ప్యానెల్, ట్రిపుల్ కెమెరాలు, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

"""/" / వన్‌ప్లస్ నార్డ్ CE 3 లైట్( Oneplus Nord CE 3 Lite ) 6.

72-అంగుళాల FHD+ IPS ఎల్‌సీడీ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరాలు, 67W ఫాస్ట్ ఛార్జింగ్‌తో కూడిన 5000ఎంఏహెచ్ బ్యాటరీతో ఏప్రిల్ 4న భారతదేశంలోకి వస్తుంది.

రెడ్‌మీ నోట్ 12 సిరీస్ అనేది రెడ్‌మీ నోట్ 12, నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో+తో సహా కనీసం మూడు మోడళ్లతో ఏప్రిల్ 5న మలేషియాలో రిలీజ్ అవుతుంది.

క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్‌ 8 Gen2 ప్రాసెసర్, 16జీబీ ర్యామ్ ఉన్న ఆసుస్‌ రోగ్ ( Asus Rog ) ఫోన్ 7 ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుంది.

మొత్తంగా చూసుకుంటే టాప్ బ్రాండ్ల నుంచి అదిరిపోయే ఫీచర్లతో మొబైల్స్ ఏప్రిల్ నెలలో రిలీజ్ అవుతున్నాయని తెలుస్తోంది.

కొత్త ఫోన్ తీసుకోవాలనుకునే వారు కొద్ది రోజులు ఆగి పైన పేర్కొన్న వాటిలో నచ్చిన దాన్ని కొనుగోలు చేసుకోవచ్చు.

రక్తహీనత నుంచి తొందరగా బయటపడాలనుకుంటే ఈ ఆహారాలను తప్పక తీసుకోండి!