Weight Loss : వెయిట్ లాస్ కు తోడ్ప‌డే టాప్ అండ్ బెస్ట్ వెజిటేబుల్ జ్యూసులు ఇవే!

ప్రపంచవ్యాప్తంగా ఏజ్ తో సంబంధం లేకుండా ఓవర్ వెయిట్ సమస్యతో బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు.

బరువు పెరగడానికి ( Gain Weight )కారణాలు అనేకం.అలాగే తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

సరైన పద్ధతులు పాటిస్తే ఎంత లావుగా ఉన్న వారైనా సన్నబడతారు.ముఖ్యంగా కొన్ని కొన్ని ఆహారాలు వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తాయి.

ఇప్పుడు చెప్పబోయే వెజిటేబుల్ జ్యూసులు( Vegetable Juices ) కూడా ఆ కోవకే చెందుతాయి.

ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సింది కీరా దోసకాయ( CUCUmber ) జ్యూస్.దీనికోసం బ్లెండర్ లో ఒక కప్పు కీర దోసకాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( Lemon Juice ), ఒక గ్లాస్ వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఆపై స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకొని చియా సీడ్స్ యాడ్ చేసి సేవించాలి.

ఈ హైడ్రేటింగ్ మరియు రిఫ్రెషింగ్ పానీయం శరీరంలో విషయాన్ని తొలగిస్తుంది.అతి ఆకలిని నియంత్రిస్తుంది.

మెటబాలిజం రేటును పెంచి బరువు తగ్గడానికి ప్రోత్సహిస్తుంది. """/" / అలాగే వెయిట్ లాస్ తోడ్పడే టాప్ అండ్ బెస్ట్ వెజిటేబుల్ జ్యూసుల్లో బీట్ రూట్ జ్యూస్ ( Beet Root Juice ) ఒకటి.

బీట్ రూట్ జ్యూస్ తయారు చేసుకోవడం కూడా చాలా సులభం.ఈ జ్యూస్ లో కేలరీలు తక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

అందువల్ల ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గుతారు.

"""/" / ఇక క్యారెట్ జ్యూస్ ద్వారా కూడా వెయిట్ లాస్ అవ్వవచ్చు.

అందుకోసం బ్లెండర్ లో ఒక కప్పు క్యారెట్ ముక్కలు, వన్ టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు మరియు గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా తయారు చేసుకున్న క్యారెట్ జ్యూస్ ను నేరుగా సేవించాలి.ఈ జ్యూస్ లో విటమిన్ ఎ తో పాటు ఆరోగ్యకరమైన కెరోటినాయిడ్స్ ఉంటాయి.

కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

జీవక్రియ చురుగ్గా మారుతుంది ఫలితంగా బ‌రువు త‌గ్గుతారు.

బిగ్ బాస్ ఒక చెత్త షో… బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వేణు స్వామి?