ఇంటర్నెట్‌ని ఊపేస్తున్న టాప్ ఏఐ ఇమేజ్‌ జనరేటర్స్ ఇవే..

ఇమేజ్‌లను రూపొందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఉపయోగించడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది.

అయితే దీని వల్ల కాపీరైట్ ప్రొటెక్షన్ విషయంలో ఆందోళనలు తలెత్తాయి.సాధారణంగా ఏఐ జనరేటర్లు( AI Generators ) ఇంటర్నెట్ ఇమేజ్ డేటాసెట్‌లపై ట్రైనింగ్ పొందుతాయి.

విజువల్ రిప్రజెంటేషన్లను అర్థం చేసుకోవడానికి ప్యాటర్న్స్‌, క్యాప్షన్స్‌ ఉపయోగిస్తాయి.మానవుల వలె చాలా క్రియేటివ్‌గా ఇమేజెస్ క్రియేట్ చేస్తాయి.

ఏఐ ఇప్పటికే ఉన్న ఆర్ట్‌వర్క్ నుంచి నేర్చుకుంటున్నప్పుడు, ఇది ఆర్ట్‌వర్క్ సారాంశాన్ని సంగ్రహిస్తుంది.

DALL-E 2, Artbreeder, Waifu లాబ్స్, డీప్ డ్రీమ్ జనరేటర్ వంటి కొన్ని ప్రముఖ AI ఇమేజ్ జనరేటర్లు కమర్షియల్ యూసేజ్‌కి అనుమతిని అందిస్తాయి.

కాకపోతే కొన్ని పరిమితులు వర్తించవచ్చు.DALL-E 2 అని పిలిచే ఏఐ ఇమేజ్ జనరేటర్‌ను ఓపెన్ఏఐ ( OpenAI ) అభివృద్ధి చేసింది.

బింగ్‌తో సహా వివిధ ప్లాట్‌ఫామ్‌లలో విలీనం అయిన ఈ జనరేటర్ వివిధ ఇమేజ్ క్రియేషన్లలో కీలకంగా మారింది.

వినియోగదారులు తాము దేనిని క్రియేట్ చేస్తే దానికి ఓనర్‌షిప్ కలిగి ఉంటారు.అంటే కాపీరైట్ హక్కులన్నీ వారి వద్దే ఉంటాయి.

"""/" / ఈ ఇమేజ్‌లను క్రియేట్ చేసినవారు సొంత ప్రయోజనాల కోసం వాడుకోవచ్చు.

లేదంటే వాటిని అమ్మేసి డబ్బులు అర్జించవచ్చు.ఆర్ట్‌బ్రీడర్ ( Artbreeder ) అనేది ల్యాండ్‌స్కేప్‌లు, ముఖాలు, పెయింటింగ్‌ల వంటి అద్భుతమైన చిత్రాలను సృష్టించడానికి, సవరించడానికి వినియోగదారులను అనుమతించే ఒక ఇమేజ్ రీమిక్సింగ్ టూల్.

ఈ టూల్‌తో యూజర్లు ఇమేజ్‌లు బ్రీడ్ చేయవచ్చు లేదా ఇప్పటికే ఉన్న ఇమేజ్‌లు రీమిక్స్ చేయవచ్చు.

"""/" / వైఫు ల్యాబ్స్, కస్టమ్ అనిమే పోర్ట్రెయిట్‌లను రూపొందించడానికి ఉపయోగపడే ఒక AI-బేస్డ్ జనరేటర్.

ఇది కూడా ఈ రోజుల్లో టాప్ ఏఐ ఇమేజ్‌ జనరేటర్‌గా కొనసాగుతోంది.డీప్ డ్రీమ్ జనరేటర్ మూడు ఇమేజ్ ప్రాసెసింగ్ ఆప్షన్స్‌ అందిస్తుంది.

ప్రాంప్ట్‌లను ఇన్‌పుట్ చేయడం, స్టైల్‌లను ఎంచుకోవడం, వారి సొంత ఇమేజ్‌లు అప్‌లోడ్ చేయడం ద్వారా ప్రత్యేకమైన విజువల్స్‌ను రూపొందించడానికి ఈ టూల్ పనికొస్తుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి3, శుక్రవారం 2025