ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్న టాప్-5 ప్లేయర్స్ వీళ్లే..!

ఐపీఎల్ సీజన్ -16( IPL Season-16 ) అట్టహాసంగా మొదలై ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు పూర్తయ్యాయి.

ఈ క్రమంలో ఆరెంజ్, పర్పుల్ క్యాప్( Orange, Purple Cap ) కోసం ఆటగాళ్ల మధ్య పోరు ప్రారంభమైంది.

అయితే ఈ రెండు రేసులలో భారత ఆటగాళ్లే ఆదిత్యంలో ఉండడం సంతోషించాల్సిన విషయమే అని చెప్పుకోవాలి.

అంతేకాదు ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్ -5 లో ముగ్గురు ఆటగాళ్లు భారత్ కు చెందిన వారే.

మరొకవైపు పర్పుల్ క్యాప్ రేసులో టాప్ -5 లో ముగ్గురు ఆటగాళ్లు భారత్ కు చెందిన వారే.

ఈ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.ఆరెంజ్ క్యాప్ అంటే ముందుగా రుతురాజ్ గైక్వాడ్( Ruthuraj Gaikwad ) పేరే గుర్తొస్తుంది.

2021 ఐపీఎల్ లో రుతురాజ్ గైక్వాడ్ ఆరెంజ్ క్యాప్ గెలిచాడు.ఈ సీజన్లో కూడా తొలి మ్యాచ్ లోనే 92 పరుగులు చేశాడు.

రెండవ మ్యాచ్లో 41 పరుగులు చేసి మొత్తం 149 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాడు.

"""/" / వెస్టిండీస్ ప్లేయర్ కైల్ మైయర్స్( Kyle Myers ) లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడిన రెండు మ్యాచ్లలో 126 పరుగులు చేసి రెండవ స్థానంలో నిలిచాడు.

ముంబై ఇండియన్స్ కు చెందిన తిలక్ వర్మ ఒక ఇన్నింగ్స్ లో 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి మూడవ స్థానంలో నిలిచాడు.

ఇక నాలుగవ స్థానంలో విరాట్ కోహ్లీ 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.

ఇంకా బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్( Faf Du Plessis ) ఆడిన ఒక్క ఇన్నింగ్స్ లో 73 పరుగులు చేసి ఐదవ స్థానంలో నిలిచారు.

"""/" / ఇక పర్పుల్ క్యాప్ రేసులో లక్నో జట్టు బౌలర్ మార్క్ ఉడ్( Mark Wood ) రెండు ఇన్నింగ్స్ లలో 8 వికెట్లు తీసి మొదటి స్థానంలో ఉన్నాడు.

తరువాత లక్నో జట్టుకు చెందిన రవి బిష్ణోయ్ ( Ravi Bishnoi )ఐదు వికెట్లు తీసి రెండవ స్థానంలో ఉన్నాడు.

రాజస్థాన్ రాయల్స్ కు చెందిన యుజ్వేంద్ర చాహల్ ఆడిన ఒక్క మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి మూడవ స్థానంలో ఉన్నాడు.

అయితే చెన్నై సూపర్ కింగ్స్ చెందిన మెయిన్ ఆలీ రెండు మ్యాచ్లలో కేవలం ఒక ఇన్నింగ్స్ లో మాత్రమే బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు తీసి నాలుగో స్థానంలో నిలిచాడు.

ఇక పంజాబ్ కు చెందిన అర్ష్ దిప్ ఒక్క మ్యాచ్లో మూడు వికెట్లు తీసి ఐదవ స్థానంలో ఉన్నాడు.

కల్కి సీక్వెల్ కు అవే హైలెట్ కానున్నాయా.. ఆ యాక్షన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయా?