ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే టాప్-10 భాషలు ఇవే..హిందీ ఏ స్థానంలో ఉందంటే..!

ప్రపంచంలో ఉండే ఏడు ఖండాలలో మొత్తం 200 కు పైగా దేశాలు ఉన్నాయి.

ఈ అన్ని దేశాలలో కలిపి మొత్తం 7 వేలకు పైగా భాషలు వాడుకలో ఉన్నాయి.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో మాతృభాష, జాతీయ అధికార భాష ఉంటున్న విషయం తెలిసిందే.

ఈ ఏడు వేల భాషలలో ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మాట్లాడే టాప్-10 భాషలు ఏంటో మీకు తెలుసా.

ఇప్పుడు మనం ఈ భాషలకు చెందిన వివరాలు ఏమిటో తెలుసుకుందాం.ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడే భాష ఇంగ్లీష్( English ).

ప్రపంచంలో ఉండే దేశాలలో 60కి పైగా దేశాలలో 135 కోట్లకు పైగా ప్రజలు ఇంగ్లీష్ భాషను మాట్లాడుతున్నట్లు ఒక అధ్యయనం ద్వారా తెలిసింది.

ఇంగ్లీష్ భాష టాప్ వన్ లో ఉంది.టాప్-2 లో చైనీస్ సంప్రదాయ భాష అయినా మాండరీన్ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 112 కోట్ల మంది మాండరిన్ భాషను మాట్లాడుతున్నారని సమాచారం.మాండరీన్ భాష చైనా తో పాటు తైవాన్ సింగపూర్ దేశాల్లో అధికార భాషగా ఉంది.

ఈ జాబితాలో మూడవ స్థానంలో భారత దేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ( Hindi ) భాష ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 60 కోట్లకు పైగా మంది హిందీ భాషను మాట్లాడుతున్నారు.హిందీ భాష మన భారతదేశంలోనే కాకుండా పాకిస్తాన్, ఫీజీ దేశాల్లోనూ అధికారిక భాషగా ఉంది.

"""/" / నాలుగవ స్థానంలో స్పెయిన్ దేశానికి చెందిన స్పానిష్ భాష( Spanish Language ) ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది స్పానిస్ మాట్లాడుతున్నారు.20 కి పైగా దేశాల్లో స్పానిష్ అధికారిక భాషగా ఉంది.

ఐదవ స్థానంలో 27 కోట్ల మంది మాట్లాడే అరబిక్ భాష ఉంది.అరబ్ లో ఉండే 22 దేశాలలో అరబిక్ అధికారిక భాషగా ఉంది.

"""/" /షగా ఉంది.ఆరవ స్థానంలో భారతదేశంలోని బెంగాలీ భాష ఉంది.

ఈ భాషను 26.8 కోట్ల మంది మాట్లాడుతున్నారు.

ఏడవ స్థానంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన ఫ్రెంచ్ భాష ఉంది.ప్రపంచవ్యాప్తంగా 26.

7 కోట్ల మంది ఫ్రెంచ్ భాషను మాట్లాడుతున్నారు.ఫ్రాన్స్ తో పాటు 29 దేశాలలో ఫ్రెంచ్ అధికారిక భాషగా ఉంది.

ఎనిమిదవ స్థానంలో రష్యాకు చెందిన రష్యన్ భాష ఉంది.25.

8 కోట్ల మంది రష్యన్ భాష మాట్లాడుతున్నారు.రష్యాలో రష్యన్ భాష అధికారిక భాషగా ఉంది.

తొమ్మిదో స్థానంలో పోర్చుగల్ దేశ భాష పోర్చుగీసు ఉంది.25.

7 కోట్ల మంది పోర్చుగీసు భాషను మాట్లాడుతున్నారు.పదవ స్థానంలో ఉర్దూ భాష ఉంది.

ప్రపంచవ్యాప్తంగా 23 కోట్ల మంది ఉర్దూ మాట్లాడుతున్నారు.మన తెలుగు భాష విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా 9.

6 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారని ఒక అధ్యయనం వెల్లడించింది.

పుచ్చ గింజలతో ఈ ఫేస్ మాస్క్ వేసుకుంటే మొటిమలు మచ్చలు మాయం అవ్వడం ఖాయం!