రక్తంలో చక్కెర స్థాయి పెరగకుండా పాటించాల్సిన చిట్కాలు ఇవే..!
TeluguStop.com
ఆహారం తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర ఒకేసారి పెరిగితే మీరు మీ జీవితంలో కొన్ని మార్గాలను అనుసరించక తప్పదు అని నిపుణులు చెబుతున్నారు.
భోజనం చేసిన తర్వాత రక్తంలో చక్కెర( Blood Sugar ) ఒకేసారిగా పెరగడాన్ని నియంత్రించడానికి మనం కొన్ని ప్రభావంతమైన మార్గాలను ఎంచుకోవాలి.
తిన్న తర్వాత మీకు తరచుగా నిరసనగా అనిపిస్తుందా? అనిపిస్తే భోజనం తర్వాత రక్తంలో చక్కెర పెరగడం అనేది మధుమేహం( Diabetes ) లేని వ్యక్తులలో ఒక సాధారణ విషయమే.
అయితే ఇది మీకు మధుమేహం వచ్చే ప్రమాదం పెంచడానికి సంకేతం కావచ్చు.ఇలాంటి సమయంలో మీరు తినే ఆహారం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.
అయితే మీరు బ్లడ్ షుగర్ ను దూరం చేసుకోవడానికి శరీరక శ్రమపై దృష్టి పెట్టడం మంచిది.
"""/" /
భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడే కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫైబర్ ఒక రకమైన కార్బోహైడ్రేట్( Carbohydrate ).ఇది శరీరంలో త్వరగా కరగదు అని దాదాపు చాలా మందికి తెలియదు.
కాబట్టి దీని వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెద్దగా ప్రభావం చూపదు.ఎందుకంటే ఇది చాలా తక్కువ చక్కెరను ఉత్పత్తి చేస్తుంది.
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మీ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.
అంతేకాకుండా ఫైబర్( Fiber ) అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.
చాలామంది తిన్న వెంటనే బద్ధకం కారణంగా నిద్రపోతారు. """/" /
తిన్న వెంటనే నిద్రపోవడం లేదా కూర్చోవడం వల్ల మీ బ్లడ్ షుగర్ పెరుగుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
మీరు ఇలా చేసినప్పుడు మీ కండరాలు అదనపు గ్లూకోస్ ను రక్తంలోకి విడుదల చేస్తాయి.
ఈ అలవాటు జీర్ణ సమస్యలను కూడా పెంచుతుంది.ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడానికి తిన్న తర్వాత కాసేపు నెమ్మదిగా నడవడం( Walking ) మంచిది.
గ్లూకోజ్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి ఇది మంచి మార్గం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే అల్పాహారం రోజులో ప్రధాన భోజనం.అల్పాహారం నుంచి మధ్యాహ్నం భోజనం వరకు స్నాక్స్ వరకు రోజులో మీరు తినే ప్రతిదీ మీ రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేస్తుంది.
కాబట్టి మధుమేహం ఉన్నప్పుడు ఏమి తినాలి.మరి ఏమి తినకూడదు అనే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఢిల్లీ రోడ్లపై చక్కర్లు కొడుతున్న దెయ్యాల ఆటో.. వీడియో చూస్తే గుండెలు అదిరిపోతాయి!