మీ పిల్లలు మొబైల్ కు ఎడిక్ట్ అయ్యారా.‌. అయితే వారిని ఇలా డైవర్ట్ చేయండి!

ప్రస్తుత రోజుల్లో పెద్దలే కాదు పిల్లలు(Children) సైతం మొబైల్ ఫోన్(Mobile Phone) కు బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.

గంటలు తరబడి ఫోన్ లో గేమ్స్ ఆడటం, వీడియోస్ చూడడం చేస్తున్నారు.ఫోన్ ఎడిషన్ వల్ల పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది.

దృష్టి లోపాలు, నిద్రలేమి, వెన్నునొప్పి, మెడ నొప్పి, అలసత్వం ఇలా అనేక సమస్యలు పిల్లల్లో తలెత్తుతాయి.

అందువల్ల పిల్లలను మొబైల్ నుంచి డైవర్ట్ చేయడం చాలా అవసరం.అయితే అందుకు పేరెంట్స్ కచ్చితంగా కొన్ని టిప్స్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఫోన్ నుంచి పిల్ల‌ల‌ను దూరంగా ఉంచాలనుకుంటే ఆకర్షణీయమైన ప్రత్యామ్నాయాలు ఇవ్వండి.

లాజిక్, క్రీయేటివిటీ పెంచే బోర్డ్ గేమ్స్, పజిల్స్ అందించండి.డ్రాయింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్ (Drawing, Painting, Crafts)లాంటివి వారితో చేయించండి.

ఇటువంటి యాక్టివిటీస్ పిల్ల‌ల‌ను బాగా ఎంగేజ్ చేస్తాయి.బాగా పిల్ల‌లు కూడా చ‌క్క‌గా ఎంజాయ్ చేస్తారు.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/02/These-are-the-tips-to-ert-children-from-mobile-phone-b!--jpg" / రాత్రి స‌మ‌యంలో మోబైల్(Mobile At Night) నుంచి పిల్ల‌ల నుంచి డైవ‌ర్ట్ (Divert)చేసేందుకు మంచి మంచి స్టోరీస్ చెప్పండి.

లేదా ఆస‌క్తిక‌ర పుస్త‌కాల‌ను వారితో చ‌దివించ‌డం అల‌వాటు చేయండి.పిల్ల‌ల‌ను ఎప్పుడూ ఇంట్లోనే ఉంచ‌కుండా అవుట్‌డోర్ యాక్టివిటీస్‌కు ప్రోత్సహించండి.

ఆట‌లు, గార్డెనింగ్, సైక్లింగ్‌, స్విమ్మింగ్ వంటి వాటిని పిల్ల‌ల‌కు అల‌వాటు చేయండి.ఇవి పిల్ల‌ల్లో శ‌రీర‌క ఆరోగ్యంతో పాటు మాన‌సిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.

""img Src="https://telugustop!--com/wp-content/uploads/2025/02/These-are-the-tips-to-ert-children-from-mobile-phone-c!--jpg" / అలాగే ఇంట్లో చిన్నచిన్న పనుల్లో పిల్ల‌ల‌ను కూడా చేయండి.

వంట చేయ‌డంలో పిల్ల‌ల హెల్ప్ తీసుకోండి.మొక్కలు నాటించడం, మొక్క‌ల‌కు వాట‌ర్ పోయ‌డం లాంటి యాక్టివిటీల్లో ఆసక్తి పెంచండి.

వీకెండ్స్ లో పార్క్‌, బీచ్, జూ లాంటి ప్రదేశాలకు తీసుకువెళ్లండి.వీల‌నైంత వ‌ర‌కు పిల్ల‌ల‌తో ఎక్కువ స‌మ‌యం గ‌డ‌పండి.

వారితో కుబుర్లు చెప్పండి.భోజనం, పడుకునే ముందు, ఫ్యామిలీ సమయాల్లో ఫోన్‌కు నో అనే కండీష‌న్ పెట్టండి.

మొబైల్‌కు బానిస కాకూడదని వారికి స్వయంగా అర్థం అయ్యేలా అవగాహన కల్పించండి.ఫోన్‌కు బదులు ఆకర్షణీయమైన ఆఫ్షన్లు ఇవ్వడం ద్వారా పిల్ల‌లు క్ర‌మంగా డైవ‌ర్ట్ అయిపోతారు.