వంటింట్లో పనులు చేసేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన చిట్కాలు ఇవే!
TeluguStop.com
ఒకప్పుడు వంటింటి పనులన్నీ ఆడవారే చూసుకునేవారు.కానీ ఇప్పటి రోజుల్లో మగవారు కూడా వంటగది వైపు తొంగి చూస్తున్నారు.
అన్ని పనుల్లో భాగం అవుతున్నారు.అయితే వంటింట్లో పనులు చేసేవారు కచ్చితంగా తెలుసుకోవాల్సిన చిట్కాలు చాలానే ఉన్నాయి.
వాటిలో కొన్నింటిపై ఇప్పుడు ఓ లుక్కేసేయండి.- రైస్(Rie) అనేది చాలా మందికి ప్రధాన ఆహారం.
అయితే అన్నం వండేటప్పుడు వాటర్ లో బియ్యం తో పాటుగా కొన్ని చుక్కలు నిమ్మరసం(lemon Juice) వేస్తే పర్ఫెక్ట్ గా కుక్ అవుతుంది.
"""/" /
-బెండకాయలు(Ladies Finger) ఒక్కోసారి ఫ్రిడ్జ్‌లో పెట్టినా కూడా పాడైపోతుంటాయి.అయితే బెండకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే రెండు వైపులా కట్ చేసి ప్లాస్టిక్ కవర్ లో వేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
- రోజువారి కూరలు వండేటప్పుడు ఉల్లిపాయ(onion) ముక్కలు త్వరగా ఫ్రై అవ్వాలంటే చిటికెడు పంచదార లేదా ఉప్పు వేసుకోవాలి.
- పాలకూర, తోటకూర (Lettuce, Asparagus)ఇటువంటి ఆకుకూరలను కాడలు కట్ చేసి పేపర్ లో చుట్టి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి.
ఇలా చేస్తే అవి ఎక్కువ రోజుల పాటు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి.- నిమ్మకాయలను తడి క్లాత్ లో చుట్టి కవర్ లో ఉంచితే చాలా రోజులు నిల్వ ఉంటాయి.
"""/" /
- వంట పూర్తయిన తర్వాత గిన్నెలు తోమడం ఎంత పెద్ద టాస్కో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
అందులోనూ జిడ్డు పాత్రలు ఉంటే పని డబుల్ అవుతుంది.అయితే జిడ్డు పాత్రలను ఉప్పులో ముంచి నిమ్మ చెక్కతో రుద్దితే త్వరగా క్లీన్ అవుతాయి.
- నెయ్యి కాచి చల్లారాక అందులో చిటికెడు రాళ్ల ఉప్పు వేసి స్టోర్ చేసుకోవాలి.
ఇలా చేస్తే నెయ్యి మంచి సువాసనతో ఎక్కువ రోజులపాటు నిల్వ ఉంటుందిజ
- కర్రీస్ ప్రిపేర్ చేసేముందు కూరగాయ ముక్కలను పసుపు నీటిలో వేసి తీయాలి.
ఇలా చేస్తే క్రిములు పోతాయి.- అప్పడాలు చాలా మందికి హాట్ ఫేవరెట్.
అయితే అప్పడాలు ఆయిల్ పీల్చకుండా ఉండాలంటే వేయించుకునే ముందు కాసేపు ఎండలో పెట్టుకోవాలి.
- చపాతీలు ఆరిపోయిన తర్వాత కూడా మెత్తగా తినడానికి రుచికరంగా ఉండాలంటే పిండి కలుపుకునే సమయంలో కొంచెం పచ్చి పాలు యాడ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే చపాతీలు సాఫ్ట్ గా టేస్టీగా వస్తాయి.
ఆ విషయంలో మహేష్ ను గౌతమ్ బీట్ చేస్తాడు.. అశోక్ గల్లా షాకింగ్ కామెంట్స్ వైరల్!